ట్రెండింగ్ లో #KeralaBoycottLEO కారణం ఆ గొడవేనా?
మోహన్ లాల్ అభిమానులు,విజయ్ అభిమానులు మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి నటించిన జిల్లా చిత్రంలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని మోహన్ లాల్ అన్నారు.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ లియో(Leo).ప్లాఫ్ అంటూ చూడని స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం..అలాగే విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం రెండొందల కోట్ల పై చిలుకే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త ఎక్కువగా ప్రమోషన్‌లు ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది.
అదేమిటంటే ఈ చిత్రాన్ని కేరళలో బోయ్ కాట్ చేయమంటూ ఓ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #KeralaBoycottLEO'అంటూ ట్రెండ్ అవుతున్న ఈ హ్యాష్ ట్యాగ్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాని కేరళలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. అందుకు కారణమేమిటనేది చాలా మందికి తెలియటం లేదు. అయితే అందుకు కారణం అంటూ ఓ విషయం బయిటకు వచ్చంది.
సోషల్ మీడియా డిస్కషన్స్ లో కేరళలోని కొందరు మోహన్ లాల్ అభిమానులు,విజయ్ అభిమానులు మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి నటించిన జిల్లా చిత్రంలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని మోహన్ లాల్ అన్నారు. అదితమిళ విజయ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. వారు ఎదురుదాడి మొదలెట్టారు. మోహన్ లాల్ నటన చాలా చిత్రాల్లో చెత్తగా ఉందంటూ క్లిప్ లు, ఫోటోలు షేర్ చేయటం మొదలెట్టారు. విజయ్ ఫ్యాన్స్ కొందరు అదో ఉద్యమంగా చేసారు. ఈ క్రమంలో మండిన మోహన్ లాల్ ఫ్యాన్స్...మా మోహన్ లాల్ నే అంటారా...మా కేరళలో మీ హీరో సినిమా ఆడనివ్వం అంటూ ...#KeralaBoycottLEO అంటూ హ్యాష్ టాగ్ ట్రెండ్ చేయటం మొదలెట్టారు. అది విజయ్ కు ఉన్న యాంటి ఫ్యాన్స్ షేర్ చేయటం,రీ ట్వీట్ చేయటం మొదలెట్టారు. అదీ విషయం.
ఇక 'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో విలన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.