ఇళయదళపతి విజయ్ గత దశాబ్దంలో తమిళ నాట అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్..లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇళయదళపతి విజయ్ గత దశాబ్దంలో తమిళ నాట అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్..లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ అడుగులు రాజకీయాల వైపు పడుతున్నాయని తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మంగళవారం రోజు కూడా విజయ్ చెన్నైలోని తన కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన తన అభిమాన సంఘ నాయకులతో మీట్ అయ్యాడు. వివిధ అంశాలపై వారితో చర్చలు జరిగిపినట్లు తెలుస్తోంది. అక్కడికి విజయ్ ఫ్యాన్స్ కూడా భారీ చేరుకున్నారు. విజయ్ మీటింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఫ్యాన్స్ విజయ్ కారుని వెంబడించారు.
దీనితో విజయ్ ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు రెండు చోట్ల రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను పోలీసులు విజయ్ కి రూ 500 జరిమానా విధించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విజయ్ ఆఫీస్ పనాయుర్ లో ఉండగా ఇల్లు నీలాంగరైలో ఉంది.
ఫ్యాన్స్ తన కారు వెంట కేకలు వేస్తూ వస్తుండడంతో వారి నుంచి తప్పించుకునేందుకు రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేసే విజయ్ వెళ్లారు. విజయ్ పొలిటికల్ హీట్ పెంచుతున్న క్రమంలో ఈ న్యూస్ కూడా వైరల్ అవుతోంది.కొన్ని రోజుల క్రితం విజయ్ తమిళనాడులో అన్ని నియోజకవర్గాల్లో 10, ప్లస్ 1, ప్లస్ 2 లలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేసి నగదు బహుమతులు అందించిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో విజయ్ మాట్లాడుతూ ఓటుకి నోటు విధానం మంచిది కాదు అంటూ ప్రసంగించి పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా అభిమాన సంఘాల నాయకులతో మీట్ కావడంతో విజయ్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఉహాగానాలు జోరందుకున్నాయి. 2024లో విజయ్ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారు అని.. 2026 ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
