‘బ్రో’ఎగస్ట్రా షోస్, టిక్కెట్ హైక్ పై నిర్మాత క్లారిటీ !
తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ `వినోదాయ సితం` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

'బ్రో' సినిమా .. రెండేళ్ల క్రితం సముద్రఖని దర్శకత్వం వహించిన `వినోదయ సీతం’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రంపై రోజుకో వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ఎగస్ట్రా షోలు, టిక్కెట్ హైక్ గురించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్మాత కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ విషయమై రీసెంట్ గా వెబ్ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చేసారు. తాము బ్రో సినిమాను బడ్జెట్ కంట్రోలులో చేసామని అన్నారు. అందుకే రెండు రాష్ట్రాలలో టిక్కెట్ రేట్లు పెంచమని గానీ... ఎగస్ట్రా షోస్ ఫర్మిషన్ గానీ అడగట్లేదు...అని చెప్పారు.
మరో ప్రక్క సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర టీమ్ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇటీవల బ్రో మూవీలోని ఫస్ట్ సింగిల్ గా `మైడియర్ మార్కండేయా` అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేసిన టీమ్ తాజాగా `జానవులే` అంటూ సాయి ధరమ్ తేజ్, కేతికశర్మలపై సాగే మరో లిరికల్‌ని రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టిల్స్‌తో, లిరికల్ వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తున్న `బ్రో`పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ ఎక్సపెక్టేషన్స్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా ఉంటుందని నిర్మాత...అభిమానులకు హామీ ఇస్తున్నారు.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోపసం డేట్, టైమ్‌ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో కీలక ఆర్టిస్ట్‌ల ఇంటర్వ్యూలని మొదలు పెట్టిన టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 25న శిల్పకళా వేదికలో `బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారట. మరో రెండు రోజుల్లో అఫీషియల్ అప్ డేట్ ని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.