Asianet News TeluguAsianet News Telugu

TFI Fans Cricket: వార్ వన్ సైడ్ .. టీమ్ ఈగల్‌పై తమ్ముడు ఎలెవన్ ఘన విజయం..

TFI Fans Cricket: తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఈగల్‌పై తమ్ముడు ఎలెవన్ ఘన విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో తమ్ముడు ఎలెవన్ కేవలం 5.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ ఈగల్‌పై  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.  

TFI Fans Cricket Thammudu XI won by 9 wickets against TEAM EAGLE KRJ
Author
First Published Jan 30, 2024, 3:25 AM IST | Last Updated Jan 30, 2024, 3:25 AM IST

TFI Fans Cricket: తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఈగల్‌పై తమ్ముడు ఎలెవన్ ఘన విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో తమ్ముడు ఎలెవన్ కేవలం 5.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ ఈగల్‌పై  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.  

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ ఈగల్ ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. తమ్ముడు ఎలెవన్ బౌలర్ల దాటికి 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. పాత్ రాజు తప్ప ఏ ఇతర బ్యాట్స్ మెన్స్ కూడా రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. ప్రధానంగా తమ్ముడు ఎలెవన్ టీమ్ బౌలర్ మరూఫ్ తన బౌలింగ్ తో ప్రత్యార్థి టీమ్ ఈగల్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. మరూఫ్ 3.4 ఓవర్స్ వేసి కేవలం 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.రాజేష్ అత్తిలి, సాయి సాలది, కేకే, విక్రమ్ లు చేరో వికెట్ పడగొట్టారు. ఇలా తమ్ముడు ఎలెవన్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేవలం 49 పరుగులకే  టీమ్ ఈగల్ కుప్పకూలింది. దీంతో టీఎఫ్ఐ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్‌లో అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్టుగా టీమ్ ఈగల్ చెత్త రిక్డారు నమోదు చేసింది.    

50 పరుగుల లక్ష్య చేధనకు వచ్చిన తమ్ముడు ఎలెవన్ టీమ్ సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తమ్ముడు ఎలెవన్ టీమ్ లో రాఘవ అమ్మిరెడ్డి దూకుడు గా ఆడాడు.  24 బంతుల్లో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. తన జట్టును విజయం తీరాలకు చేర్చారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో తమ్ముడు ఎలెవన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది

టీమ్ ఈగల్‌ - 49/10 ( 14.4)
తమ్ముడు ఎలెవన్ - 53/1 (5.3)

తెలుగు హీరోల ఫ్యాన్స్ 12 జట్లుగా విడిపోయి టీఎఫ్‌ఐ ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఆడుతున్నారు. ఈ 12 జట్లు తిరిగి నాలుగు గ్రూప్‌లుగా విభజించబడ్డాయి.  సోమవారం నాడు ప్రారంభమైన ఈ ఫ్యాన్స్ ట్రోర్నీ ఫిబ్రవరి 2 వరకు సాగనున్నది. గ్రూప్-Aలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ టీమ్స్ ఉండగా.. గ్రూప్-B లో చిరంజీవి, రవి తేజ జట్టు, గ్రూప్ C ‌లో నాగర్జున, మహేశ్ బాబు, ప్రభాస్, గ్రూప్-Dలో వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ టీమ్స్ ఉన్నాయి.

హైదరబాద్‌లోని ఆజిజ్ నగర్‌లోని ఏఎమ్ క్రికెట్ గ్రౌండ్ వేదిక జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ కు రూ. 3 లక్షలు, రన్నరప్‌కు రూ.లక్ష రివార్డు‌గా ఇవ్వనున్నారు. ఈ టోర్నీకి పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఈ మ్యాచ్ లు యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారమవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios