Asianet News TeluguAsianet News Telugu

#PawanKalyan:పవన్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్

17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
 

Tentative release date for Pawan kalyan Hari Hara Veera Mallu
Author
First Published Dec 11, 2022, 3:48 PM IST

 
 గత కొంతకాలంగా పవన్ అభిమానుల్లో ఉన్న ఏకైక ప్రశ్న.... పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి? ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు ఆయన ఎప్పుడు పూర్తి చేస్తారు..? మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు రానుండటంతో.. ఇప్పటి నుంచే రాజకీయాల్లో బిజీ అయిపోయారు జనసేనాని. మరి ఆ జనాన్ని వదిలేసి.. మళ్లీ కెమెరా ముందుకొచ్చేదెప్పుడు..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేదెప్పుడు..? కమిటైన సినిమాల్లో దేన్ని ముందు పూర్తి చేస్తారు..? వీటికి గత నాలుగు రోజులుగా వస్తున్న అప్డేట్స్ తో  దాదాపు సమాధానం దొరికింది.

ఈ క్రమంలో  పవన్, క్రిష్ కాంబినేషన్ లో  రూపొందుతున్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ( Hari Hara Veera Mallu) రిలీజ్ డేట్‌పై అందరి దృష్టీ పడింది. ఎందుకంటే మొదట థియేటర్ల లోకి  వచ్చేది ఈ సినిమానే.  బిగ్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న పీరియాడిక్ సినిమా కావ‌డంతోనే షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వస్తోంది. గత కొద్ది రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2023 మార్చి 22 న  రిలీజ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియ‌న్ సినిమా ఇద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంద‌ని నిర్మాత  ఏ.ఎమ్ ర‌త్నం ధీమాగా ఉన్నారు.

ఇందులో మొఘ‌లుల కాలం నాటి బందిపోటు దొంగ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నారు. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించబోతున్నది. జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ పై  కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

 ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. పవర్ స్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చేలా క్రిష్ సన్నాహాలు చేస్తున్నారట. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీరవాణి బాణీలు కడుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios