బాలీవుడ్ యాక్షన్ మోడ్ లో మల్టీస్టారర్ సినిమాలు వచ్చి చాలా కాలమవుతోంది. యాక్షన్ ప్రియులు మంచి ఆకలితో ఉన్నారు. అయితే ఇప్పుడు వారి ఆకలిని తీర్చడానికి బాలీవుడ్ బడా మల్టీస్టారర్ సినిమా సిద్ధమైంది. 200కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం వార్. 

తెలుగు -తమిళ్ లో కూడా ఈ బాలీవుడ్ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ అంచనాల డోస్ ని మరింత పెంచేసింది. హృతిక్ రోషన్ స్టూడెంట్ గా టైగర్ కనిపిస్తున్నాడు. అయితే గురువు ఎంచుకున్న దారికి శిష్యుడు అడ్డు చెప్పడం వంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అక్టోబర్ 2న వార్ సినిమా రిలీజ్ కానుంది.