డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్’.పిల్లలకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో ఒకటి లయిన్ కింగ్ కథని ఇప్పటికే చాలా సార్లు తెరకెక్కించి సొమ్ము చేసుకుంది. దాదాపు ప్రతీ ఐదేళ్లకు ఓ కొత్త వెర్షన్ తో అదే కథని చిన్న చిన్న మార్పులతో  తెరకెక్కిస్తూ అలరిస్తోంది డిస్నీ స్టూడియో.  అదే కోవలో ఇప్పుడు మరో సారి తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యింది. 

1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం... ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.   అలాగే నేటివిటి కోసం ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్‌లు వాయిస్‌ ఇవ్వడం విశేషం. 

ఇక తెలుగు వెర్షన్ కు వస్తే...జగపతి బాబు, రవిశంకర్, నాని, బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. దానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. దానిపై మీరు ఓ లుక్కేయండి.

ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్‌ అయిన సిండ్రెల్లా, ద జంగల్‌ బుక్‌, బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్‌ కింగ్‌ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ బిజీలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్‌ కానుంది.