Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో తెలుగు హాస్యనటుడి వెదవ్వేషాలు,జనం కొట్టారు

కొందరు నటులు తెరపై  వేసే వేషాలు వేరు. తెర వెనక వెదవ్వేషాలు వేరు. మీటూ ఉద్యమం మొదలైనా ఆ బుద్ది కొందరిలో పోవటం లేదు. 

Telugu comedian manhandled  in USA
Author
Hyderabad, First Published Jul 8, 2019, 8:27 PM IST

కొందరు నటులు తెరపై  వేసే వేషాలు వేరు. తెర వెనక వెదవ్వేషాలు వేరు. మీటూ ఉద్యమం మొదలైనా ఆ బుద్ది కొందరిలో పోవటం లేదు. అదీ విదేశాల్లో  తమ పరువు పోగొట్టుకోవటమే కాక తెలుగువారు అంటే గౌరవం తగ్గించేలా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ కమిడియన్ అమెరికాలో చేసిన రచ్చ అంతటా హాట్ టాపిక్ మారింది.

రీసెంట్ గా  టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ తెలుగు కమిడయన్  అమెరికాకు వెళ్లారు. అక్కడ ఓ ఈవెంట్ లో పాల్గొనాలి. అందుకోసం కారు వస్తే  ఆ హాస్య నటుడుని సగౌరవంగా  ఎక్కించుకుని  వెళ్తున్నారు. అయితే ఈ హాస్య నటుడు బుద్ది తిన్నమైనది కాదు. గతంలోనూ షూటింగ్ లోనూ , బయిట అమ్మాయి కనపడితే అంగలార్చతూ ఉంటాడు. అదే అక్కడా చేసాడు. తన ప్రక్కనే కూర్చున్న  అమ్మాయిపై చెయ్యి వేసాడు. మొదట క్యాజువల్ గా వేసాడనుకున్నా తర్వాత అసలు విషయం ఆమెకు అర్దమైంది. దాంతో ఆమె వెంటనే ఆ హాస్య నటుడుపై సీరియస్ అయ్యింది. 

కారు ఆపి రెండు పీకింది. అంతేకాదు ఆ విషయం తెలియని ఆమెకు చెందిన వారు సైతం వచ్చి మ్యాన్ హాండిలింగ్ చేసారని సమాచారం. పోగ్రాం సైతం కాన్సిల్ అయ్యింది. పోలీస్ కేసు పెడతానంటే హాస్యనటుడు కాళ్ల బేరానికి దిగివచ్చి బ్రతిమాలటంతో ఆగారని తెలుస్తోంది. అలాగే మీడియాకు ఈ విషయం తెలియచేవద్దని బ్రతిమిలాడుతున్నాడని, తెలిసిన మీడియాను తన వార్త బయిటకు తేవద్దని కోరినట్లు సమాచారం.  అయితే ఇలాంటివి ఆగుతాయా...రేపో మాపో పూర్తి వివరాలతో వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios