ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ (Chinni Krishna) పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ (Chinni Krishna) పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని చిన్నికృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రియల్టర్లు కొందరు చిన్నికృష్ణపై దాడికి ప్రయత్నించారు. పరుష పదజాలంతో దూషించారు. ఈఘటనపై శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో చిన్ని కృష్ణ ఫిర్యాదు చేశారు. కరోనాతో ఇబ్బందిపడుతున్న తనను… ఇంట్లోకి చొచ్చుకొచ్చి బెదిరించారని చెప్పారు. పరుష పదజాలంతో తనను దూషించారని తెలిపారు.తనపై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్ని కృష్ణ డిమాండ్ చేశారు.
