టాలీవుడ్ లో 'అవును', 'అవును 2', 'అనామిక', 'ఫిదా' వంటి చిత్రాల్లో నటించిన హర్షవర్ధన్ రానే.. చాలా రోజులుగా నటి కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. తనకంటే నాలుగేళ్లు పెద్దదైన కిమ్ శర్మతో అతడు డేటింగ్ చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అనే చెప్పాలి.

వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను మీడియా కథనాలుగా ప్రచురించేది. అయితే ఇకపై ఈ జంట కలిసి కనిపించే అవకాశాలు లేవని తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హర్షవర్ధన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. కిమ్ శర్మని 'కె' అంటూ సంభోదిస్తూ ఆమెకు ఒక లేఖ రాశాడు.

''కె.. థాంక్యూ జెంటిల్ సోల్.. నీతో కలిసి ఉన్నప్పుడు అధ్బుతంగా అనిపించింది. నీకు ఆ దేవుడు దీవెనలు ఉండాలి..'' అంటూ రాసుకొచ్చాడు. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఈ జంట ఎప్పుడూ తమ బంధాన్ని దాచాలని అనుకోలేదు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు.

అయితే గత నెలలో వీరిద్దరి మధ్య గొడవ రావడంతో ఒకరితో మరొకరికి పడడం లేదట. దీంతో బ్రేకప్ అయినట్లు సమాచారం. కిమ్ శర్మ తెలుగులో.. 'ఖడ్గం', 'మగధీర' వంటి  చిత్రాలలో నటించింది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#GodBlessYou #Respect

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) on Apr 19, 2019 at 4:21am PDT