ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారు. 


వినాయక చతుర్థి వేళ టాలీవుడ్ లో అపశృతి చోటు చేసుకుంది. మెగా హీరో ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ధరమ్ తేజ్ రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధరమ్ తేజ్ కి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


మొదట దగ్గర్లో ఉన్న మెడికవర్ హాస్పిటల్ లో ధరమ్ ని అడ్మిట్ చేశారు. అనంతరం ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ధరమ్ తేజ్ మెడికల్ కండీషన్ పై అపోలో వైద్యులు గత అర్థరాత్రి బులెటిన్ విడుదల చేశారు. శరీరంలోని ప్రధాన అవయవాలకు ఎటువంటి గాయాలు కాలేదని, కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో పాటు కొన్ని కండరాలు దెబ్బ తిన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని సదరు బులెటిన్ లో తెలియజేశారు. 


ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారు. అలాగే ధరమ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా, వైద్యుల బులెటిన్ కాపీ షేర్ చేశారు. సాయి ధరమ్ సేఫ్ గా ఉన్నారని, ఎక్స్పర్ట్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెల్లడించారు.