నయిం డైరీ చిత్ర ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బెల్లి లలిత పాత్రపై అభ్యంతరకరంగా చిత్రీకరించారని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. నయిం డైరీస్ సినిమాను అడ్డుకున్నామని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేశారు. 

నయిం డైరీ చిత్ర ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బెల్లి లలిత పాత్రపై అభ్యంతరకరంగా చిత్రీకరించారని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. నయిం డైరీస్ సినిమాను అడ్డుకున్నామని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేశారు. 

మావోయిస్ట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం(Nayeem) రాష్ట్రంలో ఎంతటి సంచలనాలను సృష్టించారో తెలిసిందే. ఉద్యమకారుడిగా ఎదిగి, అట్నుంచి పోలీసులకు కోవర్ట్ గా మారిపోయి నక్సల్‌ కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తూ, అట్నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు నయీం. పోలీసులు పెంచి పోషించిన గ్యాంగ్‌స్టర్‌ Nayeem ఆగడాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఆయన్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 

ALso Read:Nayeem Diaries Review: `నయీం డైరీస్‌` మూవీ రివ్యూ

నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక కొత్త విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో రాజకీయ నాయకులు, పోలీసులకు ఉన్న సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ కేసుని జాగ్రత్తగా క్లోజ్‌ చేశారు పోలీసులు. ఇంతటి దుమారం రేపి, సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన నయీం జీవితం ఆధారంగా తాజాగా `నయీం డైరీస్‌`(Nayeem Diaries) అనే సినిమా తెరకెక్కించారు. దాము బాలాజీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నయీం పాత్రలో వశిష్ట సింహ నటిస్తున్నారు. సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు.

ఓ వైపు నక్సల్స్ కి మద్దతుగా నిలుస్తూ పోలీసులను, పోలీసులకు మద్దతుగా నిలుస్తూ నక్సల్స్ ఏరివేతకు కారణమయ్యాడనేది, అట్నుంచి సొంతంగా గ్యాంగ్‌ స్టర్‌గా ఎదగడం, ఈ క్రమంలో అనేక మందిని చంపేయడం, దోచుకోవడం, అమ్మాయిలతో గడపడం వంటివి ఇందులో చూపించారు. చివరికి పోలీసులా, నక్సలైట్లా అంటే మాత్రం తాను నక్సలైట్లనే ఎంచుకుంటా అని చివర్లో చెప్పడంతో నయీం చివరి రోజుల్లో నక్సల్స్ కి మద్దతు దారుడిగా నిలిచాడనే విషయాన్ని తెలియజేశారు. దివి, బాహుబలి నిఖిల్‌, యజ్జ శెట్టి, సంయుక్త హార్న్‌డ్, శశి కుమార్‌, దేవి ప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు.