వ్యూహం సినిమా విడుదలకు మళ్ళీ హైకోర్టు బ్రేకులు!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా వ్యూహం చిత్ర విడుదలకు మరోసారి బ్రేక్ పడింది. సెన్సార్ సర్టిఫికెట్ నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది.
రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు మళ్లీ బ్రేకులు వేసింది. సెన్సార్ బోర్డు సరిఫికెట్ ను నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మూడు వారాలలో మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేశ్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది.
వ్యూహం సినిమాను డిసెంబర్ 29న విడుదల చేయాలని భావించారు. చిత్ర విడుదలను ఆపాలంటూ నారా లోకేష్ కోర్టును ఆశ్రయించాడు. వ్యూహం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జరిగిన పరిణామాలు, జగన్ జైలుపాలు కావడం, అనంతరం పాదయాత్ర వంటి విషయాలు ఈ సినిమాలో చూపించారు.
అయితే నిజ జీవిత వ్యక్తులను కించ పరిచే విధంగా సినిమా ఉందని ఆరోపణలు ఉన్నాయి. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు ఇంకొందరిని తప్పుగా చూపించారు. వ్యక్తిత్వం దెబ్బ తీసేలా సినిమా ఉందని విడుదల అడ్డుకోవడం జరిగింది.