అపోలో ఆసుపత్రి సహకారంతో 45ఏళ్లు పై బడిన సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్ లకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవిని తెలంగాణ గవర్నర్‌ ప్రశంసించారు.

`కరోనా క్రైసిస్‌ ఛారిటీ' పేరుతో గతేడాది 'సీసీసీ'ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా వేల మంది సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందజేశారు. తాజాగా ఇదే ఛారిటీతో మరో కరోనా వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. అపోలో ఆసుపత్రి సహకారంతో 45ఏళ్లు పై బడిన సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్ లకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సినీ కార్మికులు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ గవర్నర్‌ తమిళ సై సౌందరరాజన్‌ స్పందించారు. చిరంజీవిని అభినందించారు. `తెలుగు సినీ దిగ్గజ నటుడు చిరంజీవి గారు కరోనా క్రైసిస్‌ చారిటీ ద్వారా అపోలో సహకారంతో సినీ కార్మికులకు, సినీ జర్నలిస్ట్ లకు ఉచిత వ్యాక్సినేషన్‌ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇదొక మంచి ప్రయత్నం` అని తెలిపారు. ఈ సందర్బంగా గవర్నర్‌ కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ యాష్‌ ట్యాగ్‌ని పంచుకున్నారు. అదే సమయంలో గతంలో చిరంజీవి తనని కలిసిన ఫోటోని పంచుకున్నారు. 

Scroll to load tweet…