నైజాంలో టికెట్స్ ధరల విషయమై ఆచార్య యూనిట్ కి తీపి కబురు అందింది. ఆచార్య మూవీ టికెట్స్ ధరలు పెంచుతూ తెలంగాణా గవర్నమెంట్ ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఈ మేరకు మొదటి వారం ఆచార్య టికెట్స్ ధరలు పెంచుకునే వెసులుబాటు కలిగింది. 


చిరంజీవి-చరణ్ (Ram Charan)ల మల్టీస్టారర్ ఆచార్య విడుదలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో చిత్రం యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరోలతో పాటు దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. కాగా ఆచార్య(Acharya) మూవీ టికెట్స్ ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణా గవర్నమెంట్ జీవో జారీ చేసింది. 

మల్టీఫ్లెక్స్, లార్జ్ స్క్రీన్ థియేటర్స్, రీక్లైనింగ్ సీట్స్ కలిగిన థియేటర్స్ రూ. 50 వరకు అదనంగా టికెట్ ధరలు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్స్ లో రూ. 30 అదనంగా టికెట్ ధర పెంచుకునేలా అనుమతులు జారీ చేశారు. మిగతా థియేటర్స్ లో ధరలు యధాతధంగా ఉంటాయి. మొదటి వారం రోజులు మాత్రమే టికెట్స్ ధరల పెంపునకు అనుమతినిచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ ధరలు రూ. 210, రూ. 350లుగా ఉండనున్నాయి.అలాగే ఉదయం 7 గంటల నుండి రాత్రి 1 వరకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతులు ఇచ్చారు. ఏపీ గవర్నమెంట్ కి ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాల టికెట్స్ ధరలు పెంచుకునేలా ఏపీ గవర్నమెంట్ అనుమతులు జారీ చేసింది. 

సీఎం జగన్ తో చిరంజీవి(Chiranjeevi)కి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఏపీలో కూడా టికెట్స్ ధరలు పెంచుకునేలా అనుమతులు రావచ్చు. ఇక దర్శకుడు కొరటాల శివ సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆచార్య తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.