తెలంగాణాలో ఎన్నికల హడావిడి ఉంటుందని తెలిసి కూడా ఈరోజు బాక్సాఫీస్ వద్ద సినిమాలను విడుదల చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ప్రజలు సినిమా థియేటర్లకు వస్తారనే నమ్మకంతో రిస్క్ తీసుకున్నారు.

ఈరోజు నాలుగు సినిమాలను విడుదల చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం', తమన్నా 'నెక్స్ట్ ఏంటి', సుమంత్ 'సుబ్రమణ్యంపురం', అలానే 'శుభలేఖ+లు' అనే చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

ఈ సినిమాలు శుక్రవారం ఉదయం 8:45 షోకి థియేటర్లలో ప్రదర్శించాలి కానీ 8:45, అలానే 10 గంటల షోలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఏ థియేటర్ లో కూడా ఉదయం ఆటలను ప్రదర్శించలేదు.

11 గంటల నుండి షోలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది. అయితే మీడియా సభ్యులకు మాత్రం ఉదయాన్నే స్పెషల్ షోలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  ఎన్నికల సమయం కలిసొస్తుందని సినిమా రిలీజ్ చేసిన మేకర్స్ కి షోలను రద్దు చేసి షాక్ ఇచ్చింది ప్రభుత్వం.