Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Result 2023: తెలంగాణాలో విజయం కోసం బండ్ల గణేష్ ప్రత్యేక పూజలు, వైరల్ అవుతున్న వీడియో

తెలంగాణాలో ఎన్నికల ఫలితాల హిట్ స్టార్ట్ అయ్యింది. ఎవరికివారు గెలపుపై లెక్కలు వేసుకుంటుండగా.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బండ్లగణేష్ ప్రత్యేక పూజలు చేయించి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. 

Telangana Election Result 2023 Bandla Ganesh Special pooja For congress Winning JMS
Author
First Published Dec 3, 2023, 9:29 AM IST

ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ మరో సారి హాట్ టాపిక్ అయ్యారు.  రాష్ట్రంలో ఈరోజు( డిసెంబర్ 3) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ.. కాంగ్రెస్ విజయం కోసం బండ్ల గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో విజయం కోసం మొక్కులు చెల్లిస్తున్న బండ్ల గణేష్ వీడియో సోల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి నుంచి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు బండ్ల. తెలంగాణ లో కాంగ్రేస్ కు సపోర్ట్ చేస్తూ.. పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన  ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఇటీవలే ఆయన తెలంగాణ ఎన్నికలపై కూడా రకరకాల  కామెంట్లు చేస్తున్నారు బండ్ల. 

 

అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం ఖాయం అని.. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తారని..  డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఉంటే తాను 7వ తారీఖునే వచ్చి ఉంటానని చెప్పి వైరల్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ కంటే బండ్ల గణేశ్ పోల్స్ వచ్చాయని, అందులో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ అని చెప్పానని బండ్ల గణేశ్ అన్నారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తాను చెప్పినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి 76 నుంచి 86 సీట్ల వరకు వస్తాయని బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88 సీట్లు వచ్చాయని, అంతకంటే ఒక్క సీటు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి రావాలని వ్యక్తిగతంగా తన అభిలాష అని వివరించారు.
ఇక సీఎం ఎవరు అనే ప్రశ్నపైనా బండ్ల గణేశ్ మాట్లాడారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రాణంపెట్టి కొట్లాడాడని, ఆయనే సీఎం అని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ఎల్బీ నగర్ స్టేడియంలో డిసెంబర్ 9వ తేదీన, సోనియమ్మ పుట్టిన రోజున రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. తాను డిసెంబర్ 7వ తేదీనే అక్కడికి వెళ్లుతానని, దుప్పటి కూడా తీసుకెళ్లుతానని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios