Asianet News TeluguAsianet News Telugu

KCR Speaks Chiranjeevi : చిరంజీవికి సీఎం కేసిఆర్ ఫోన్.. ఏంమాట్లాడారంటే..?

మెగాస్టార్ చిరంజీవి కరోనాతో హోమ్ క్యారంటైన్ లో ఉన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కు పాజిటివ్ అని తేలడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్(CM KCR) చిరంజీవికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.

Telangana CM KCR Speacks Megastar Chiranjeevi
Author
Hyderabad, First Published Jan 27, 2022, 1:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి కరోనాతో హోమ్ క్యారంటైన్ లో ఉన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి  పాజిటివ్ అని తేలడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్(CM KCR) చిరంజీవికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.

కరోనా థార్డ్ వేవ్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈసారి సెలబ్రెటీ స్టార్స్ టార్గెట్ గా కారోనా విజృంబిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు.. సినిమా స్టార్స్ ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా మరోసారి కరోనా బారిన పడ్డారు.

కరోనా అంతకంతకు కోరలు చాచుతోంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ ఎవరినీ కరోనా వదిలిపెట్టడంలేదు. ముఖ్యంగా ఈ థార్డ్ వేవ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. సినిమా వాళ్లను కోవిడ్ వదిలిపెట్టడం లేదు. మహేష్ బాబు(Mahesh Babu), తమన్, ధనుష్ ఇలా స్టార్స్ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక నిన్న  మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా పాజిటీవ్ వచ్చినట్టు ప్రకటించారు.

కరోనాతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న మెగాస్టార్(Megastar Chiranjeevi)  ను తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) పరామర్శించారు. స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసిన కేసీఆర్.. ఆయన ఆరోగ్యం గరించి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దానితో పాటు పలు విషయాలు కూడా వారి మధ్య చర్చకువచ్చినట్టు సమాచారం. చిరంజీవి త్వరగా కోలుకోవాలని కేసీఆర్(CM KCR) ఆకాంక్షించారు. తనకు ఫోన్ చేసి పరామర్శించినందకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)  కూడా కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేసినట్టు తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 25న కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా  నిన్న ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించాయని.. దాంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‎గా తేలిందని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవలసిందిగా ఆయన కోరారు.  కరోనా అని తెలియడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళారు మెగాస్టార్.

అయితే మెగాస్టార్ చిరంజీవికి((Megastar Chiranjeevi) ) కరోనా రావడం ఇది రెండో సారి. లాస్ట్ టైమ్ కూడా చిరంజీవికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అప్పుడు లక్షణాలు లేకుండా.. సాధారణ పరిక్షల్లో కారోనా అని తేలింది. ఇక ఇప్పుడు రెండో సారి స్వల్ప లక్షణాలతో కరోనా  బారిన పడ్డారు మెగాస్టార్.

Follow Us:
Download App:
  • android
  • ios