సల్మాన్ ఖాన్ చిత్రంలో బతుకమ్మ సాంగ్.. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

తెలంగాణ బతుకమ్మ క్రేజ్ దేశవ్యాప్తంగా వెళ్లనుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’ నుంచి తాజాగా బతుకమ్మ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సాంగ్ కు విశేష ఆదరణ దక్కుతోంది.

Telangana BATUKAMMA song in Salman Khan's upcoming film Kisi Ka Bhai Kisi Ki Jaan NSK

పూల పండుగ బతుకమ్మ గురించి తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పాటలను ఇక్కడి ప్రజలకు ఎంతలా ఇష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొమ్మిదిరోజులు జరిగే బతుకమ్మ ఫెస్టివల్ లో అంతటా బతుకమ్మ పాటలే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం సినిమాల ద్వారా తెలంగాణ సంస్కృతికి, పాటలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచమే మనవైపు తిరిగి చూసింది. నిన్న విడుదలైన తెలంగాణ ‘దసరా’ చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ఈక్రమంలో తొలిసారిగా హిందీ సినిమాలో.. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)  నటించిన చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడం ఆసక్తికరంగా మారింది.  కొద్దిసేపటి కింద బతుకమ్మ సాంగ్ విడుదలై ప్రేక్షకాదరణ పొదుతోంది.  

సల్మాన్ ఖాన్ - పూజా హెగ్దే జంటగా నటిస్తున్న చిత్రంKisi Ka Bhai Kisi Ki Jaan. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో విక్టరీ వెంకటేశ్, జగపతి బాబు, షెహనాజ్ గిల్, విజేందర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ పత్యేక పాత్రలో కనిపించనున్నారు.  ఈద్ కానుకగా ఏప్రిల్ 21న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఆకట్టుకుంటున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో చిత్రం నుంచి నాలుగో సాంగ్ ను ‘బతుకమ్మ’ పాటగా విడుదల చేశారు. అలాగే కొంత వీడియో భాగాన్ని కూడా విడుదల చేశారు. విక్టరీ వెంకటేశ్, పూజా హెగ్దే, సల్మాన్ ఖాన్ పూలపండుగ బతుకమ్మలను ఎత్తుకొని వస్తుండటం, బతుకమ్మపాటకు చిందులేయడం ఆఖట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

తెలంగాణ బతుకమ్మ సాంగ్ ను సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా నార్త్ ఆడియెన్స్ కు వినిపించడం విశేషంగా మారింది. ఈ సాంగ్ విడుదలపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కూడా స్పందించారు. బతుకమ్మకు పాన్ ఇండియా క్రేజ్ దక్కుతుదంటూ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ వాసులు కూడా సంతోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ బతుకమ్మకు గుర్తింపు దక్కుతుండటంతో సంతోషిస్తున్నారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios