టాలీవుడ్ లోనూ ట్రెండ్ మారిపోయింది. హాట్ సీన్లకు పచ్చి బూతు డైలాగులు ప్రియారిటీ పెరుగుతోంది. తమ సినిమాలో ఏదో ఒక చోట రెచ్చగొట్టే ఏదో డైలాగ్ లేక బూతు పదం ఉంటే దాన్ని లేదా ట్రైలర్ లేదా టీజర్  లో హైలెట్ చేసి సినిమాకి పాపులారిటీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ దిశగా ఇప్పటికే కొంతమంది ప్రయత్నం చేసి సెక్సస్ సాధించగా మరి కొంతమంది ఇదే కరెక్ట్ అనుకుని అదే దారిలో ముందుకు వెళ్తున్నారు. 

సినిమాలో విషయం ఎంత ఉంది ఏముంది అనే దానికన్నా.. ముందు సినిమాని డిస్ట్రిబ్యూటర్లు లేదా ఓటిటి ప్లేయర్స్ చేత కొనిపించటం.. దర్శక నిర్మాతల ముందున్న లక్ష్యం గా మారింది. దాంతో వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డైలాగుల్లో ఉపయోగించే బూతు పదాలు చూస్తూ ఉంటే సెన్సార్ ఉందా లేదా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ట్రైలర్స్ కి టీజర్స్ కి కూడా సెన్సార్ ఉంటుంది. ఓటీటి వచ్చాక అన్ని అర్దాలు మారిపోతున్నాయి. తాజాగా రిలీజైన  ‘క‌మిట్‌మెంట్‌’ టీజర్ చూస్తూంటే అది నిజమే అనిపిస్తుంది. 

తేజ‌స్వి మ‌డివాడ, అన్వేషి జైన్, ర‌మ్య ప‌సుపిలేటి‌, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల‌లో న‌టించిన చిత్రం ‘క‌మిట్‌మెంట్‌’. ల‌వ్, డ్రీమ్, హోప్‌, ఫైట్ అనే నాలుగు భిన్నమైన స్టోరీల‌తో ఈ చిత్రం సాగుతుంది. ‘హైద‌రాబాద్ న‌వాబ్స్’ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శక‌త్వం వ‌హించారు. ర‌చ‌న మీడియా వ‌ర్క్స్‌ స‌మ‌ర్పణ‌లో ఎఫ్3 ప్రొడ‌క్షన్, ఫుట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ టి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. అందులో డైరక్ట్ గా లం...కొడకా అనే పదం వాడారు. అలాగే సె..క్స్ అనే పదం కూడా వాడారు. 

 దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. ‘కమిట్‌మెంట్’ టీజర్ చూసిన తరవాత కొంత మంది బయటికి చెప్పలేరు కానీ లోపల ఎలా ఉంటుందో నాకు తెలుసు.  ప్రతి ఒక్కడూ ఒక అమ్మాయి అనగానే కాంప్రమైజ్‌లు, కమిట్‌మెంట్లు తప్ప అంతకు మించి ఎక్కువ ఆలోచించట్లేదు. ఇది నిజం. కమిట్‌మెంట్ అనగానే సినిమా ఇండస్ట్రీనే తిడతారు. సినిమా ఇండస్ట్రీలోనేకాదు అన్ని ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఉంది. ఈ విషయాన్ని చెప్పడమే నా కమిట్‌మెంట్. ఈ నాలుగు స్టోరీల్లో ఇదే ఉంది. స్కిన్ షో చూపించేసి సినిమా అమ్ముకోవడం నా ఉద్దేశం కాదు. నా మీద, నా కథ మీద నాకు నమ్మకం ఉంది’’ అని లక్ష్మీకాంత్ చెప్పుకొచ్చారు.