Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: అమ్మని తీసుకురాలేకపోయా.. తేజ ఎమోషనల్‌ కామెంట్స్.. ఎలిమినేషన్‌ భయంతో రతిక కన్నీళ్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోలో తాజాగా టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన ఎమోషనల్‌ కామెంట్స్ చేశాడు. మరోవైపు రతిక కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

teja emotional words regards his mother after eliminated from bigg boss telugu 7 and rathika fear arj
Author
First Published Nov 5, 2023, 11:18 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో మరో వారం పూర్తయ్యింది. తొమ్మిదో వారం కూడా అయిపోయింది. ఊహించినట్టే టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. రతికకి, తేజకి మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఎలిమినేషన్‌ ప్రక్రియలో తేజ ఔట్‌ అయ్యాడు. అయితే తాను ఇన్ని వారాలు ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉందని, తనది గొప్ప జర్నీ అంటూ కూల్‌గా తీసుకున్నాడు తేజ. అయితే తేజ ఎలిమినేషన్‌తో హౌజ్‌ మొత్తం షాక్‌ అయ్యింది. అంతా రతిక వెళ్లిపోతుందనుకున్నారు. కాన తేజ ఎలిమినేట్‌ కావడం ఆశ్చర్యపరిచింది. ఆయన ఎలిమినేషన్‌తో హౌజ్‌లో అంతా ఎమోషనల్‌ అయ్యారు. శోభా శెట్టి కన్నీరు మున్నీరైంది. అంతగా ఈ ఇద్దరు కనెక్ట్ అయ్యారనేది తెలిసిందే. 

అయితే ఎలిమినేషన్‌కి ముందు రతిక భయంతో కన్నీళ్లు పెట్టుకుంది. తానే ఎలిమినేట్‌ అవుతానని భావించి, హోస్ట్ నాగార్జునని రిక్వెస్ట్ చేసుకుంది. ఒక్క వారం అవకాశం ఇవ్వండి అంటూ బ్రతిమాలుకుంది. నాగ్‌ని వేడుకుంది. తాను ఏం చేయలేనని, ఓటింగ్‌ అయిపోయిందని, ఎలిమినేషన్‌ డిసైడ్‌ పోయిందన్నారు. చివరగా ఈ ఇద్దరి మధ్య ఉత్కంఠభరితమైన రిజల్ట్ లో తేజ ఎలిమినేట్‌ కావడంతో రతిక ఊపిరి పీల్చుకుంది. ఇకపై తానేంటో చూపిస్తా అని చెప్పింది. 

ఇక ఎలిమినేట్‌ అయిన తేజ తన జర్నీ చూసుకుని ఆనందించాడు. తాను ఊహించలేదని, ఈ స్టేజ్‌పైకి వస్తానని ఊహించలేదని, అలాంటి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చి, హౌజ్‌లో ఇన్ని రోజులు ఉండేలా చేసిన బిగ్‌ బాస్‌కి, నాగార్జునకి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇంత కాలం ఉండటం హ్యాపీనే అని, కానీ అమ్మని బిగ్‌ బాస్‌ షోలోకి తీసుకురాలేకపోయాననే వెలితి ఉందని, ఆ కోరిక తీరకుండానే వెళ్తున్నానని, కొంత భారంతో ప్రయత్నం చేయాలన్నారు. 

వెళ్లే ముందు హౌజ్‌ మేట్స్ గురించి చెబుతూ, వారిక ఆట తీరుకి మార్కులిచ్చారు. తన ఫ్రెండ్‌ శోభా శెట్టికి 20 మార్కులిచ్చాడు. మరోవైపు బాగా ఆడాలని తెలిపాడు. తనని బాగా భరించిందని చెప్పగా ఆమె ఎమోషనల్‌ అయ్యింది. గౌతమ్ అతిగా ఆలోచిస్తాడని,అది తగ్గించుకోవాలని తెలిపారు. ఆయనకు 8 మార్కులిచ్చాడు. ఇలా అర్జున్‌కి ఎనిమిది, యావర్‌కి పది, భోలేకి ఏడు, అశ్వినికి 8, ప్రశాంత్‌కి 9, ప్రియాంకకి 10, అమర్‌ దీప్‌ కి 9, రతికకి ఐదు, శివాజీకి ఎనిమిది మార్కులిచ్చాడు.

అంతకు ముందు గేమ్‌లో పాట ట్యూన్‌ని బట్టి హుక్‌ స్టెప్‌ని గెస్‌చేయాల్సి ఉంటుంది. ఇందులో అమర్‌ దీప్ టీమ్‌ విన్నర్‌గా నిలిచింది. లగ్జరీ బడ్జెట్‌ పొందింది. మరోవైపు ఈ షోలో `జిగర్‌తాండ డబుల్‌ ఎక్స్` టీమ్‌ లారెన్స్, ఎస్‌ జే సూర్య సందడి చేశారు. తమ సినిమాని ప్రమోట్‌ చేసుకుంటూ హుక్‌ స్టెప్స్ తో అదరగొట్టారు లారెన్స్. మరోవైపు హౌజ్‌మేట్స్ ఇతరలకు సెట్ అయ్యే ట్యాగులను వేయాల్సి ఉంటుంది. ఇందులో అశ్వినిపై ఎక్కువగా కామెంట్లు వచ్చాయి. ఆమె నోటికి సంబంధించిన ట్యాగులు ఎక్కువగా రావడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios