బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో కూడా ఈ షో మొదలై రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. ప్రస్తుతం మూడో సీజన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. కంటెస్టంట్ లను కన్ఫర్మ్ చేశారని ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరోపేరు వచ్చి చేరింది. అదే తీన్మార్ సావిత్రి. బిగ్ బాస్ షోలో ఈమె కూడా పార్టిసిపేట్ చేయబోతుందని టాక్. కొన్నేళ్లుగా ఓ ఛానెల్ లో ప్రసారం అవుతోన్న తీన్మార్ వార్తలతో సావిత్రి అలియాస్ జ్యోతి బాగా ఫేమస్ అయింది.

తెలంగాణా అమ్మాయిగా షోలో ఆమె ఎంట్రీ ఉండవచ్చని అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే  ఆమె  అంగీకరించిందా..? లేదా అనే విషయంలో స్పష్టత లేదు.

నిత్యం వార్తలతో బిజీగా ఉండే సావిత్రి ఈ షోకి రాకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. ఈమెతో పాటు శ్రీముఖి, జాహ్నవి, జ్వాలా గుత్తా ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. హోస్ట్ గా నాగార్జునని దాదాపు ఫైనల్ చేసినట్లేనని చెబుతున్నారు.