విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు  చాలా కాలం క్రితం అంటే జనవరిలో నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన పందిపిల్ల కథ ‘అదుగో’ దెబ్బతినటంతో సైలెంట్ అయ్యిపోయాడు.  అయితే కొద్ది గ్యాప్ తీసుకున్న  రవిబాబు ‘ఆవిరి’తో మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు.  ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు రవిబాబు.

టీజర్ లో పెద్దగా ఏమీ రివీల్ చేయకపోయినా ,, ఓ ఇంట్లో ఓ దెయ్యం ఉందనే విషయం , దాని చుట్టూ తిరిగే కథ అని మాత్రం అర్దమవుతోంది. మీరు నివసిస్తున్న ఇంట్లో మీకు తెలియని కంపెనీ ఉంటే? మీరు ఆత్మను ఎలా గుర్తిస్తారు ? మీకు తెలిస్తే మాకు చెప్పండ‌ని టీజ‌ర్ విడుద‌ల చేశారు. రవిబాబు సినిమా అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుందన్న నమ్మకం తో ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఇక ఇప్పటికే  సినిమా షూటింగ్ పూర్తై పోయిందని సమాచారం. ఇందులో ర‌విబాబుతో పాటు నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. దిల్ రాజు కు సినిమా చూపించారు.ఆయన కు కాన్సెప్టు నచ్చి రిలీజ్ చేయటానికి ముందుకు వచ్చారు.దాంతో దిల్ రాజు బ్యానర్ పై ఈ సినిమా రిలీజ్ అవుతోంది.  త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు.