నేడు విరాటపర్వం టీజర్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ ప్రకటన చేశారు. మార్చ్ 18న సాయంత్రం 5:04 నిమిషాలకు విరాట పర్వం టీజర్వి డుదల కానుంది. విరాటపర్వం టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కావడం మరో విశేషం. ఈనేపథ్యంలో రానా ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కెరీర్ బిగినింగ్ ఉంది వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమా కోసం విలన్ కూడా మారిన ఘనత ఆయనది. ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మల్టీస్టారర్ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ లో కూడా కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు రానా. కాగా ఆయన చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం విరాటపర్వం. యదార్ధ సంఘటనల ఆధారంగా 1992నాటి కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో రానా నక్సలైట్ రవన్నగా కనిపించనున్నాడు.
కాగా నేడు విరాటపర్వం టీజర్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ ప్రకటన చేశారు. మార్చ్ 18న సాయంత్రం 5:04 నిమిషాలకు విరాట పర్వం టీజర్వి డుదల కానుంది. విరాటపర్వం టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కావడం మరో విశేషం. ఈనేపథ్యంలో రానా ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విరాట పర్వం మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. 90లనాటి పల్లెటూరి ఆడపిల్లగా ఇప్పటికే సాయి పల్లవి లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్.. కోలు కోలు.. సైతం ప్రేక్షాదరణ పొందింది. మరో టాలెంటడ్ యాక్ట్రెస్ ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. దర్శకుడు వేణు ఉడుగుల చిత్ర విజయంపై చాలా విశ్వాసంతో ఉన్నారు.
