శేరిలింగంపల్లి అసెంబ్లీ సీటును టీడీపీ భవ్య ఆనంద్ ప్రసాద్‌కు కేటాయించింది. ఈ స్థానం నుండి  ఆనంద్ ప్రసాద్ టికెట్టు రావడం వెనుక సినీ నటుడు బాలకృష్ణ తెరవెనుక చక్రం తిప్పారని తెలుస్తోంది. సినీ నిర్మాతైన ఆనంద్ ప్రసాద్ బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రాన్ని నిర్మించారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన చాలా నష్టపోయారు. అయితే ఇప్పుడు ఎక్కువగా రాజకీయ అనుభవం లేని ఆనంద్ ప్రసాద్ కు బాలయ్య ముందుండి శేరి లింగంపల్లి టికెట్ రావడానికి కృషి చేశారని సమాచారం. ఇక మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచి ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

2014 ఎన్నికల సమయంలో శేరిలింగంపల్లి స్థానంలో  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అరికెపూడి గాంధీ విజయం సాధించారు. జీహెచ్ఎంసీ  ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

అయితే ఇటీవల కాలంలో  టీఆర్ఎస్ నుండి  మువ్వా సత్యనారాయణ టీడీపీలో చేరారు. శేరిలింగంపల్లి  టీడీపీ టికెట్టు మువ్వా సత్యనారాయణకే దక్కుతోందని భావించారు. కానీ  అనూహ్యాంగా భవ్య ఆనంద్ ప్రసాద్ తెరమీదికి వచ్చింది.

చివరి నిమిషంలో టీడీపీలో చేరిన మువ్వాకు  టికెట్టు దక్కకుండా ఆనంద్ ప్రసాద్ కు టికెట్టు కేటాయించడం వెనుక సినీ నటుడు బాలకృష్ణ తెరవెనుక చక్రం తిప్పారని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

పైసా వసూల్ సినిమాకు ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.  ఈ పరిచయం కారణంగా శేరిలింగంపల్లి సీటు కోసం బాలకృష్ణ నుండి ఆనంద్ ప్రసాద్  ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. బాలకృష్ణ చక్రం తిప్పడంతో ఆనంద్ ప్రసాద్ కు టికెట్టు దక్కింది.  బాలయ్య వల్ల మువ్వ సత్యనారాయణకు టికెట్టు దక్కకుండా పోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.