విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ 'టాక్సీవాలా' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ సినిమా సక్సెస్ అయిన తరువాత యూనిట్ కోసం స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు.

ఈ పార్టీకి చిత్రబృందం, హీరో, హీరోయిన్, డైరెక్టర్ తో పాటు ఇండస్ట్రీలో కొందరు ప్రతిభావంతులైన యువ దర్శకులను కూడా ఆహ్వానించారు. ఈ పార్టీలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి దర్శకుడు రాహుల్ వెల్లడించారు.

''టాక్సీవాలా సినిమా హిట్ అయిన తరువాత అల్లు అర్జున్ మా అందరికీ బీ డబ్స్ లో పార్టీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన నన్ను పక్కకు తీసుకెళ్లి సారీ చెప్పారు. ఎందుకని అడిగాను. దానికి ఆయన ప్రీ రిలేజ్ ఈవెంట్ లో నేను మీ పేరు చెప్పడం మర్చిపోయాను అందుకే అని చెప్పారు. నేను వెంటనే పర్వాలేదండి..

నేను కొత్త, నా వర్క్ మీరు చూడలేదు కదా అన్నాను. దానికి బన్నీ 'చూసిన చూడకపోయినా నేను స్టేజ్ మీద గురించి మాట్లాడాలి ఎందుకంటే డైరెక్టర్ అనేది గౌరవప్రదమైన  పొజిషన్. అలాంటి మీ గురించి స్టేజ్ పై మాట్లాడడం మర్చిపోయాను. క్షమించండని అన్నారు. బన్నీ అలా మాట్లాడడం ఆయన గొప్పతనమంటూ'' రాహుల్ వెల్లడించాడు.