Asianet News TeluguAsianet News Telugu

త‌రుణ్‌ భాస్క‌ర్ ఐడియా అదిరింది

ఓ ప్రక్కన వేరే దర్శకులకు సైతం స్క్రిప్టు లు రాస్తూ డబ్బు సంపాదిస్తున్న తరుణ్ భాస్కర్...తాజాగా మరో ఆలోచన చేసారు. ఆయన సిని ప్రేమికుల కోసం ఓ యాప్ ని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ యాప్ ఐడియా అద్బుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు.
 

Tarun Bhaskar would be launching a movie recommender App
Author
Hyderabad, First Published Aug 3, 2020, 8:50 AM IST

 
తెలివైన వాళ్లు అవకాశాలు కోసం ఎదురుచూడరు..క్రియేట్ చేసుకుంటారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ది కూడా అదే స్కూల్. లాక్ డౌన్ టైమ్ లో అందరూ ఖాళీగా ఉంటే తరుణ్ భాస్కర్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ ప్రక్కన వేరే దర్శకులకు సైతం స్క్రిప్టు లు రాస్తూ డబ్బు సంపాదిస్తున్న తరుణ్ భాస్కర్...తాజాగా మరో ఆలోచన చేసారు. ఆయన సిని ప్రేమికుల కోసం ఓ యాప్ ని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ యాప్ ఐడియా అద్బుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు.
 
ఆ యాప్ ప్రత్యేకత ఏమిటంటే...సినిమాలు,వెబ్ సీరిస్ లు ఇష్టపడే వారికి ఏవి బాగుంటాయో అని ఎంపిక చేసి అందిస్తుందిట. ఏ షో బాగుంటుంది..ఏ షో ఎలా ఉంటుంది. జానర్ ఏమిటి..వంటి అనేక విషయాలు ఆ యాప్ లో పొందుపరుస్తారట. ఈ యాప్ ని తెలంగాణాకు చెందిన ఇద్దరు యంగస్టర్స్ సాయింతో చేస్తున్నారట. తరుణ్ భాస్కర్ కు ఈ ఐడియా నచ్చి వారితో కలిసి పనిచేస్తున్నారట. తన ఐడియాలు సైతం షేర్ చేసి యాప్ ని ముందుకు తీసుకెళ్తారట. 

సినీ కెరీర్ విషయానికి వస్తే...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వచ్చిన  `పెళ్లిచూపులు`తో  తరుణ్‌భాస్క‌ర్ పేరు ఒక్కసారిగా మారు మ్రోగిపోయింది. ఈ సినిమాతో తరుణ్ కు అభిమానులు సైతం ఏర్పడ్డారు. ద‌ర్శ‌కుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత `ఈ న‌గ‌రానికి ఏమైంది?` చిత్రాన్ని రూపొందించారు. ఆ  సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ద‌ర్శ‌కుడిగా గ్యాప్ తీసుకుని నటుడుగా సినిమా చేసాడు.

`మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ తన నటనతో  ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ నేపధ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ వాట్ నెక్ట్స్ అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌ైంది. మరో ప్రక్క తరుణ్ అతి త్వ‌ర‌లో భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.  .హార్స్ రైడింగ్ నేపధ్యంలో వెంకటేష్ తో ఈ  సినిమా చేయటానికి సిద్దపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios