తారకరత్నని గుర్తు చేసుకుంటూ కూతురు ఎమోషనల్.. వీడియో షేర్ చేసిన అలేఖ్య రెడ్డి
నందమూరి హీరో తారకరత్న గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా తండ్రిని గుర్తు చేసుకున్నారు కూతుళ్లు. వీడియో వైరల్ అవుతుంది.
నటుడు తారకరత్న గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఆయన నారా లోకేష్ నిర్వహించిన `యువగళం` పాదయాత్ర(జనవరి 26)లో పాల్గొని అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఆయన గుండె పోటుకి గురయ్యాడు. పాదయాత్రలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. దాదాపు ఇరవై రోజులపాటు పోరాడి చివరికి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణించి ఏడాది కావస్తుంది. ఇది ఫిబ్రవరి నెల కావడంతో ఏడాది కార్యక్రమాలకు (మొదటి వర్థంతి) సిద్ధమవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా తారకరత్నని గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా వారికి పిల్లలు, భార అలేఖ్య రెడ్డి తారకరత్న ఆలోచనలతోనే ఉన్నారు. పిల్లలు మాత్రం తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఆయనపై ప్రేమని చాటి చెబుతున్నారు.
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఓ వీడియోని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో పెద్దకూతురు తండ్రి చిత్ర పటం వద్ద కనిపించింది. ఆయన్ని స్మరించుకుంది. డాన్సు చేసింది. తండ్రితో మాట్లాడింది. అందరు కలిసి ఆడుకున్నారు. తల్లి అలేఖ్య రెడ్డితో కలిసి సరదాగా గడిపారు. మరోవైపు తాతయ్య విజయ సాయి రెడ్డిని చూసి ఒక్కసారిగా ఆయన వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నారు. ఇదంతా చాలా ఎమోషనల్‌గా ఉంది. గుండెని బరువెక్కించేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
తారకరత్నది, అలేఖ్యరెడ్డిని ప్రేమ వివాహం. ఆమెని 2012లో ఈ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అలేఖ్య ‘నందీశ్వరుడు’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాకుండా తారకరత్న.. చెన్నైలో అలేఖ్య సిస్టర్‌కు సీనియర్ అట. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ వీళ్ల పెళ్లికి ఇరు కుంటుంబాలు అంగీకరించలేదు. ఎంపీ విజయసాయిరెడ్డి సహకారంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్‌లో జరిగింది. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Read more: చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం ఘన సత్కారం.. నంది అవార్డులు ఇవ్వనందుకు బాధగా ఉందని వెల్లడి..