Asianet News TeluguAsianet News Telugu

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో సందడి చేయనున్న తారక్.. బాబాయ్ షోకు గెస్ట్ గా రానున్న అబ్బాయ్?

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ టాక్ షో సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో క్రేజీ బజ్ వినిపిస్తోంది.
 

Tarak will be a guest on Balakrishanas Unstoppable with NBK?
Author
Hyderabad, First Published Jun 23, 2022, 4:40 PM IST

నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ ప్రస్తుతం ఏ సినిమా చేసినా.. ఎలాంటి ఈవెంట్ కు హాజరైనా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు ఓటీటీ వేదికన టాక్ షోతోనూ అదరగొడుతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (Aha) రూపొందించిన ప్రత్యేకమైన టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ఈ టాక్ షో మొదటి సీజన్ కు నందమూరి  బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.  అయితే షో ప్రారంభంలోస్టేజీపైనే సరిగా మాట్లాడలేని బాలయ్య టాక్ షోతో ఎలా ఆకట్టుకుంటాడని పలువురు విమర్శలు చేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా Unstopable with NBKతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

 షోకు వచ్చే అతిథులను బాలకృష్ణ ఆహ్వానించే తీరు.. ఆయన వాక్ చాతుర్యం, కామెడీ టైమింగ్, ఈజీ కన్వర్జేషన్ షోను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను  విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య మాటలకు ఆడియెన్స్ తో పాటు గెస్ట్స్ కూడా ఫిదా అయ్యారు. సీజన్ వన్ లో వచ్చిన పది ఎపిసోడ్స్ ట్రెండింగ్ గా నిలిచాయి. దీంతో ఇండియాస్ నెంబర్  వన్ టాక్ షోగా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ రికార్డు క్రియేట్ చేసింది. అయితే షో డైరెక్టర్ష్ సెకండ్ సీజన్ ను కూడా తీసుకొస్తున్నట్టు ఇటీవల  అఫిషియల్ గా అనౌన్స్ చేసింది.

దీంతో బాలయ్య షోకు గెస్ట్స్ గా ఎవరు రాబోతున్నారనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే మొదటి షోకు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) అతిథిగా వస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గెస్ట్ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా వినిపిస్తోంది. ఫస్ట్ సీజన్ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్న  తారక్ సెకండ్ సీజన్ లో బాబాయ్ తో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి సంభాషణలో ఎలా ఉండబోతుందనేది ఆడియెన్స్ కు కిక్కిస్తోంది. అలాగే వెంకటేశ్, నాగార్జున, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షోకు రానున్నారని టాక్.  ఆగస్టు 15 నుంచి టాక్ షోను ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. 

ప్రస్తుతం బాలకృష్ణ తన రాబోయే చిత్రం NBK107 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారకు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ సగానికిపైగా పూర్తైనట్టు సమాచారం. చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్బీకే107 పోస్టర్స్, ఫస్ట్ ఎటాక్ కు ఆడియెన్స్ నుంచి క్రేజీ  రెస్పాన్స్ వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios