ఆది పినిశెట్టి- తాప్సీ జంటగా కోన వెంకట్ సమర్పణలో నూతన చిత్రం

First Published 4, Dec 2017, 12:35 AM IST
tapsi pannu new movie in telugu with adi pinisetty
Highlights
  • ఆది పినిశెట్టి -తాప్సీ జంటగా నూతన చిత్రం
  • కోనవెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్త నిర్మాణం
  • ఈ చిత్రానికి దర్శకత్వం హరి

 

 

కోన వెంకట్ సమర్పణలో "గీతాంజలి" చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం డిసెంబర్ 21న ప్రారంభంకానుంది. "సరైనోడు, నిన్నుకోరి" లాంటి చిత్రాల్లో వెర్సటైల్ రోల్స్ ప్లే చేసి, ఇప్పుడు "రంగస్థలం, అజ్ణాతవాసి" చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా తాప్సీ నటించనుండగా మరో ప్రముఖ కథానాయిక కూడా ఈ చిత్రంలో నటించనుంది. 

 

ఆది పినిశెట్టి-తాప్సీ వైవిధ్యమైన పాత్రల్లో నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హైద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపధ్యంలో రూపొందనుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్ లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి "లవర్స్" ఫేమ్ హరి దర్శకత్వం వహించనున్నారు. 

 

ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: అనిల్-భాను, పి.ఆర్.ఓ: వంశీ కాక, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (అర్జున్ రెడ్డి ఫేమ్), కళ: చిన్న, సంగీతం: గోపీసుందర్, కూర్పు: ప్రవీణ్ పూడి, కో-డైరెక్టర్: భాస్కర్, మాటలు: కోన వెంకట్-భవానీ ప్రసాద్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: హరి.

loader