హీరోయిన్ తాప్సి కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సినిమాల్లో నటించాలని ఢిల్లీలో నా తల్లిదండ్రులని వదలిపెట్టి ముంబై వచ్చా. ముంబైలో నాకు అద్దె ఇల్లు దొరకడానికి నెల రోజుల సమయం పట్టింది. అద్దె ఇల్లు కావాలని ఎవరిని అడిగా ఏం చేస్తుంటారు అని అడిగారు. సినిమాల్లో నటించడానికి వచ్చాను అని చెప్పగానే ఇల్లు ఇవ్వడం కుదరదని పంపించి వేశారు. 

రూ 500 ఖర్చు చేసి హాయిగా సినిమా చూస్తారు. కానీ సినిమా వాళ్ళని మాత్రం ఎదో శత్రువులని చూసినట్లు చూస్తారు. తమ గురించి కొంతమంది ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాదు అని తాప్సి తెలిపింది. హైదరాబాద్ తన సొంత ఊరు ఢిల్లీ లాగే అనిపించిందని తాప్సి తెలిపింది. నాకు హైదరాబాద్ లో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. 

నా దృష్టిలో ఢిల్లీ, హైదరాబాద్ రెండూ ఒకటే. హైదరాబాద్ నాకు ఎంతగానో నచ్చింది. చాలా తక్కువ సమయంలోనే హైదరాబాద్ పరిస్థితులకు అలవాటు పడిపోయా. ప్రస్తుతం నేను, నా చెల్లి ఓ అపార్ట్మెంట్ లో సంతోషంగా ఉంటున్నాం అని తాప్సి తెలిపింది. తాప్సి ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన మిషన్ మంగళ్ చిత్రంలో నటిస్తోంది.