Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ కేసు: ముంబయి పోలీసులపై తనుశ్రీ షాకింగ్‌ కామెంట్స్

తను శ్రీ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ సూసైడ్‌ కేసుపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ముంబయి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాలుగు రోజులు హడావుడి చేసిన తర్వాత కేసుని క్లోజ్‌ చేస్తారని ఆరోపించారు.

tanushree shocking comments on mumbai police
Author
Hyderabad, First Published Aug 3, 2020, 9:49 AM IST

బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ `మీ టూ ` ఉద్యమానికి తెరలేపి రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన తను శ్రీ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ సూసైడ్‌ కేసుపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ముంబయి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

దీనిపై ఆమె స్పందిస్తూ, జనరల్‌గా ఇలాంటి మిస్టరీ కేసులపై ముంబయి పోలీసులు వేగంగా స్పందిస్తారని తెలిపింది. అంతలోనే వారిపై పిడుగులాంటి ఆరోపణలు చేసింది. ఇలాంటి కేసుల్లో ముంబయి పోలీసులు నిందితుల వైపే ఉంటారని, వారితో చేతులు కలిపి కేసుని తప్పుదోవ పట్టిస్తారని, కొన్నిరోజులు కాలయాపన చేసి ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా కేసుని క్లోజ్‌ చేస్తారని ఆరోపించింది. 

బడా బాబులవైపే ముంబయి పోలీస్‌ డిపార్ట్ మెంట్‌ పనిచేస్తుందని సంచలన కామెంట్‌ చేసింది. సుశాంత్‌ కేసు విషయంలో కూడా పెద్ద పెద్ద వాళ్లను పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయడం మొత్తం ఓ షో అని, ప్రస్తుతం ఈ కేసు హాట్‌ టాపిక్‌ కాబట్టి హడావుడి చేస్తున్నారని, ఇదంతా ప్రజలను మాయ చేయడమే అని, మున్ముందు ఈ కేసు విషయంలో మనం అనేక షాకింగ్‌ వార్తలు వినాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. ఏ సందర్భంలో, ఎలాంటి కట్టు కథలైనా అల్లగలసమర్థులని మండిపడింది. దీంతో తనుశ్రీ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై ముంబయి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ కేసులో బీహార్‌ పోలీసులు కూడా ఇన్‌వాల్వ్ అయిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల(క్యాస్టింగ్‌ కౌచ్‌) గురించి సంచలన వ్యాఖ్యలు చేసి పాపులర్‌ అయ్యారు తనుశ్రీ. దాదాపు ఆ ఆరు నెలలు బాలీవుడ్‌ని `మీటూ` ఉద్యమం ఓ ఊపుఊపేసింది. అనేక మంది హీరోయిన్లు ముందుకొచ్చి తామకి ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి బహిరంగంగా చెప్పారు. దీంతో ఇది టాలీవుడ్‌తోపాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమలకు కూడా పాకింది. దాదాపు ఓ ఏడాది పాటు హడావుడి జరిగిన తర్వాత యదావిధిగా ఇప్పుడంతా సైలెంట్‌ అయిపోయారు. అలానే సుశాంత్‌ కేసు విషయంలోనే జరుగుతుందని తనుశ్రీ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios