మలేషియా ప్రధానితో సూపర్ స్టార్ రజినీ కాంత్ మర్యాదపూర్వక భేటీ.. ఆయనేమన్నారంటే..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. సామాన్యనుల దగ్గర నుంచి దేశాదినేతల వరకూ.. ఎంతోమంది తలైవా అభిమానులే. ఇక తాజాగా సూపర్ స్టార్ పై తన అభిమానం చాటుకున్నారు మలేషియా ప్రధాని.

జైలర్ సినిమాతో మంచి ఫామ్ లో ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. చాలా కాలం హిట్ లేక ఇబ్బంది పడ్డ తలైవా.. తాజాగా జైలర్ సినిమాతో భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ.. కాసుల వర్షం కురిపిస్తున్నాడు. దాంతో రజనీకాంత్ ను విమర్షించిన నోర్లు మూతపడ్డాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు కొద్ది సేపు ముచ్చటించుకున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే రజనీకాంత్ తో భేటీకి సబంధించిన ఫోటోలు. వీడియోలను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫోటోలు షేర్ చేశారు. శేర్ చేయడంతో పాు ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల కష్టాలు, ఆ సమయంలో తాను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారన్నారు. భవిష్యత్తులో ఆయన నటించే సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని తాను కోరినట్లు వెల్లడించారు. రజనీకాంత్ తాను ఎంచుకునే ప్రతి రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఈ భేటికి సబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక రజనీకాంత్ జైలక్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినా కూడా థియేటర్ లో ఈమూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందింది..ఈ మూవీలో వినాయకన్, రమ్యకృష్ణ, వసంత్ రవి, సునిల్ ,యోగిబాబు నటించారు. ఇక ప్రత్యేక పాత్రల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ అతిధి పాత్రల్లో కనిపించారు