Asianet News TeluguAsianet News Telugu

నన్ను ట్రోల్ చేస్తారు అనుకున్నా.. బాలీవుడ్ పై విజయ్ సేతుపతి వ్యాఖ్యలు వైరల్..

బాలీవుడ్ ఆడియన్స్ పై చమక్కులు పేల్చారు తమిళ హీరో.. విజయ్ సేతుపతి. తనను ట్రోల్స్ చేసి.. ఆట ఆడుకుంటారు అనుకున్నాను.. కాని అంటూ.. విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 

Tamil Star Vijay Sethupathi Interesting Comments about Bollywood Auditions JMS
Author
First Published Jan 9, 2024, 4:28 PM IST

విజయ్ సేతుపతి.. చిన్న హీరోగా తమిళ ఫిల్మ్ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి.. తెలుగులో కూడా జెండా పాతారు.. ఇక ఈమధ్యే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన ఈ హీరో.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోగా.. విలన్ గా.. ఇలా మాల్టీ టాలెంటెడ్ స్టార్ గా.. పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు., బాలీవుడ్ నుంచి విజయ్ కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేశాడు విజయ్. అంతే కాదు అక్కడి ఆడియన్స్ గురించి విజయ్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

విజయ సేతుపతి నటించిన మేరీ క్రిస్మస్ సినిమా 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో హిందీలో ఓ వెబ్ సిరీస్ ఫర్జీలో కూడా విజయ్ సేతుపతి నటించి మెప్పించారు. ఇక మేరీ క్రిస్మస్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలోనూ ప్రేక్షకులు విజయ్ సేతుపతిని బాగానే ఆదరిస్తున్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. హిందీలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాను అనుకున్నా.. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఆదరణ నాకు గొప్ప ఆశీస్సుల్లాంటివి.. ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు అని అన్నారు.

అంతే కాదు..నాకు హిందీ మీద పెద్దగా పట్టు లేదు. దాంతో ఏదో బాలీవుడ్ కు వెళ్తున్నాను కానినాహిందీ భరించలేక అక్కడి ఆడియన్స్ ఎక్కువకాలం నన్ను భరించరేమో అనుకున్నాన్నా.. ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేస్తా అని అనుకున్న అని అన్నారు విజయ్.  నా మొదటి రెండు సినిమాలు రిలీజ్ అవ్వకముందే ఫర్జీ వెబ్ సిరీస్ తో పాటు.. షారుఖ్ ఖాన్  జవాన్‌  సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. దాంతో నేను  షాక్ అయ్యాను. కానీ ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తుంటే గర్వంగా ఉంది అన్నారు విజయ్. 

సౌత్ నుంచి వచ్చినవారి హిందీ అరోరకంగా ఉంటుంది అంటుంటారు... దాంతో మొదట్లో నా హిందీ చూసి అక్కడి ప్రేక్షకులు నన్ను ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు అని ఫిక్స్ అయ్యి ఉన్నాను.అదే  అనుకున్నా అంతే కాదు ఫర్జీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గోస్వామికి కూడా అదే చెప్పను కానీ ఆయన ఇక్కడ ప్రేక్షకులు నిన్ను ఇష్టపడతారు అని చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రేక్షకులు ఆ సిరీస్‌లో నా యాక్టింగ్ ను ఎంజాయ్ చేశారు. ఒక్కసారి ప్రేక్షకులు మనకు కనెక్ట్ అయితే మనల్ని ఇష్టపడుతూనే ఉంటారు అని అర్ధమైంది. బాలీవుడ్‌లో నాకొచ్చిన క్రెడిట్‌ మొత్తాన్ని దర్శకులు, రచయితలకు ఇస్తాను అని చాలా హుందాగా మాట్లాడారు  విజయ్ సేతుపతి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios