Suriya : గాయపడ్డ సూర్య.. ‘కంగువా’ సెట్ లో ప్రమాదం.. ఏం జరిగిందంటే?
తమిళ స్టార్ సూర్య తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ‘కంగువా’ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు ఆయన సెట్ లో గాయపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం నటిస్తున్నచిత్రం ‘కంగువా’ (Kanguva) . శివ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పికే చిత్రం నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కు అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే.. ‘కంగువా’ మూవీ సెట్స్ లో తాజాగా సూర్య గాయపడ్డట్టు తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే ప్రమాదానికి గురయ్యారని సమాచారం. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ఓ ముఖ్యమైన షార్ట్ ను చిత్రీకరిస్తున్న సమయంలో కెమెరా హ్యాండిల్ సూర్య భుజానికి తగిలింది. వెంటనే ఆస్పత్రికి కూడా చికిత్స నిమిత్తం తరలించారు. ట్రీట్ మెంట్ చేశారు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చారంట. కాస్తా నొప్పి ఉండటంతో ఒకరోజు షూటింగ్ ను నిలుదల చేశారు.
సూర్యకు గాయమవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సెట్స్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూర్యను కోరుతున్నారు. ప్రస్తుతం ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ స్కేల్లో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 11న ఈ చిత్రం ఏకంగా 38 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.