Asianet News TeluguAsianet News Telugu

WWE స్టార్ జాన్ సేనాతో కార్తీ.. నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న తమిళ స్టార్.. వైరల్ పిక్

తమిళ స్టార్ కార్తీ (Karthi)  హైదరాబాద్ లో తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, యాక్టర్ జాన్ సేన ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారింది.  
 

Tamil Star Karthi Meets WWE World Champion John Cena NSK
Author
First Published Sep 8, 2023, 9:50 PM IST

కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగు ప్రేక్షకులకు ఎంతోగానో పరిచయం. సినిమాలతోనే కాకుండా ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటారు. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో కార్తీ తాజా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం WWE వరల్డ్ ఛాంపియన్ జాన్ సెనా (John Cena)తో ఉన్న ఫొటోను పంచుకోవడమే. హైదరాబాద్‌ వేదికగా జరగనున్న WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ 2023 కోసం రెజ్లర్‌లు ఇక్కడకు వచ్చారు. ప్రమోషనల్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇతర రెజ్లర్‌లతో పాటు జాన్ సేనా కూడా వచ్చారు. 

ఈ క్రమంలో కార్తీ  జాన్ సేను ప్రత్యేకంగా కలిశారు. ఆయనతో ఓ ఫొటో కూడా దిగారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తీ జాన్ సెనాకు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఆ ఫొటో నెట్టింట వైరల్  అయ్యింది. ఫొటో షేర్ చేస్తూ జాన్ సేనా గురించి కొన్ని మాటలు చెప్పారు. క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు కార్తీ.. ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది జాన్ సేతా. ఎంతో ప్రేమగా, అభిమానంతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొద్ది నిమిషాల్లోనూ మీరు ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా భావించగడం అద్భుతంగా ఉంది. మీ లాయల్టీ, రెస్పెక్ట్ అన్నింటినీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో కార్తీ పేరు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది.

అయితే, జాన్ సేనాతో కలిసి ఉన్న ఫొటోను కార్తీ పంచుకోవడంతో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. కార్తీ ఇటీవల WWE  టీమ్ సభ్యులు కెవిన్ ఓవెన్స్, సమీ జైన్‌లను కూడా కలిసిరని అంటున్నారు. ఓ ప్రాజెక్ట్ పై సీక్రెట్ గా వర్క్ చేస్తున్నారని టాక్. దీంట్లో ఎంత నిజముందో మున్ముందు తెలియాల్సి ఉంది. చివరిగా ‘సర్దార్’తో అలరించిన కార్తీ.. నెక్ట్స్ ‘జపాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios