ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న పదం బాలీవుడ్ బాయ్ కాట్. ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇక దీనిపై స్టార్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వివాదంపై ఫన్నీగా స్పందించాడు తమిళ స్టార్ హీరో విక్రమ్. కామెడీ చేశాడు.
ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న పదం బాలీవుడ్ బాయ్ కాట్. ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇక దీనిపై స్టార్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వివాదంపై ఫన్నీగా స్పందించాడు తమిళ స్టార్ హీరో విక్రమ్. కామెడీ చేశాడు.
బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలు వరుసగా బాయ్‌కాట్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన లాల్‌సింగ్ చడ్డాతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన రక్షా బంధన్ మూవీస్ కు బాయ్‌కాట్ సెగ గట్టిగా తగిలింది. ఈ ప్రభావం లైగర్ సినిమా మీద కూడా గట్టిగా చూపించింది. ఈనెల 25న రిలీజ్ అయిన లైగర్ ని కూడా బాయ్ కాట్ చేయాలంటూ...#BoycottLiger అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీటర్‌లో ట్రెండ్ చేశారు. దాంతో ఈ సినిమా పై కూడా ఈ ప్రభావం తప్పలేదు.
ఈ మధ్య వస్తున్న ప్రతీ సినిమాకు బాయ్ కాట్ సెగ తగులుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇది తప్పడంలేదు. బాలీవుడ్ మేకర్స్ ,స్టార్స్ పై కోపంగా ఉన్నారు నెటిజన్లు. అందుకే ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాలన్నింటికి ఏదో ఒక రకంగా బాయ్‌కాట్ సెగ తగిలింది. అయితే ఈ వివాదంపై రకరకాలుగా స్పందిస్తున్నారు ఇండస్ట్రీకి చెందిన స్టార్స్. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెల్లడిస్తున్నారు. రీసెంట్ గా ఆలియా భట్ ఆవేశంగా స్పందించి వివాదానికి కారణం అయ్యింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ బాయ్‌కాట్ వివాదంపై విచిత్రంగా స్పించించారు.. ఒక రకంగా కామెడీ చేశారు.
విక్రమ్ హీరోగా నటించిన తాజా మూవీ కోబ్రా ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో ఊపుపెంచాడు విక్రమ్. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విషయంపై తన అభిప్రాయం వ్యాక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ మూవీస్ అంటూ పలు బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేస్తున్నారు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. విక్రమ్ మాట్లాడుతూ.. అసల్ బాయ్‌కాట్ అంటే ఏంటి? బాయ్ అంటే తెలుసు.. గర్ల్ బాగా అంటే తెలుసు.. చివరకు కాట్ అంటే కూడా నాకు తెలుసు కానీ.. బాయ్‌కాట్ అనే పదమే నాకు తెలియదు అని కాస్త సెటైరికల్ గా మాట్లాడారు విక్రమ్.
తన కోబ్రా ప్రమోషన్స్ లో ఉన్న విజయ్.. ఈసినిమాను అందరి దగ్గరకు చేర్చడానికి బాగా కష్టపడుతున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ జంటగా.. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించింది. ఇర తెలుగులో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
