Vijay : వద్దంటూనే పాలిటిక్స్ వైపు చూస్తోన్న విజయ్..? ఎలక్షన్స్ లో పోటీకి గ్రీన్ సిగ్నల్..?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్(Vijay) పొలిటికల్ ఎంట్రీకి సిగ్నల్స్ అందుతున్నాయి. వద్దు వద్దు అంటూనే.. రాజకీయాలకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్(Vijay) పొలిటికల్ ఎంట్రీకి సిగ్నల్స్ అందుతున్నాయి. వద్దు వద్దు అంటూనే.. రాజకీయాలకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) రాజకీయ ఆరంగేట్రం పై చాలా కాలంగా డిస్కర్షన్ నడుస్తోంది. తమిళనాట కోట్లాది ఫ్యాన్స్ ను కలిగిఉన్న స్టార్ హీరో.. తమిళ రాజకీయల్లో చక్రంతిప్పుతారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఎం. చంద్రశేఖర్ విజయ్(Vijay) మక్కల్ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించారు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటూ.. విజయ్ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడు.
అయితే విజయ్(Vijay) కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట. కాకపోతే ఆయన బయటపడటం లేదని.. లోలోపల కావల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
విజయ్(Vijay) ఎంత వద్దు అంటున్నా.. రీసెంట్ గా జరిగిన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడొద్దంటూ విజయ్(Vijay) ఆంక్షలు పెట్టినా.. ఇంటింటికీ తిరిగి విజయ్ అభిమానులు పోటీచేస్తున్నవారిని గెలిపించుకున్నారు.
ఎన్నికల్లో సక్సెస్ సాధించడమే కాదు.. ఆ సక్సెస్ ను విజయ్(Vijay) తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. వారంతా విజయ్‌ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు.అసలు రాజకీయాలు ఇష్టం లేనివాడు అభిమానులను ఇలా ఎలా ఎంకరేజ్ చేశాడంటూ.. రకరకాల మాటలు వినిపించాయి అప్పుడు. ఇక ఇప్పుడు ఏకంగా నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా విజయ్(Vijay) అభిమానులు పోటీ చేయబోతున్నారు.
ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్(Vijay) మక్కల్ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని గురించి విజయ్(Vijay) మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ మీడియాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రకటనలో నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు.
విజయ్(Vijay) కు తెలియకుండా ఇదంతా జరగదు కదా..? ఈ పరిస్థితులు చూస్తుంటే.. విజయ్ కూడా త్వరలో మనసు మార్చుకుని.. డైరెక్ట్ గా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తానన్న రజనీ కాంత్ (Rajanikanth) వెనక్కి తగ్గారు. ఇప్పుడు డీఎంకేతో పాటు సినిమావాళ్ళ నుంచి కమల్ హాసన్ ( Kamal Hasan) పార్టీ ఉంది. అయితే ముందు ముందు మంచి రాజకీయ ప్రత్యామ్నాయం కోసం విజయ్ పార్టీతో ముందుకు వస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఆయన నిజంగా పాలిటిక్స్ లోకి వస్తే.. ప్రభంజనం సృస్టించి అధికారంలోకి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.