సినిమాలకు విజయ్ గుడ్ బై...? పార్టీ పేరు ఫిక్స్..? ఎన్నికలకు సిద్ధం అవుతున్న దళపతి

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దం అవుతోంది.  అతి త్వరలోనే ఆయన పాలిటిక్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. పార్టీ పేరును కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ పార్టీ పేరు ఏంటంటే..? 

Tamil Star Hero Thalapathy Vijay Political Party Tamila Munnetra Kalagam JMS


విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీకి  అంతా సిద్దం అవుతోంది.. ఏక్షణంలో అయినా విజయ్ పార్టీని ప్రకటించే అవకాశం లేకపోలేదు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో విజయ్ ఇప్పటికే పలుమార్లు తన అభిమాన సంఘాలతో వరుస సమావేశాలు పెడుతూ వచ్చాడు. ఈక్రమంలో  ఈసమావేశాల్లోనే పార్టీ పేరును కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పేరును కూడా రిజిస్టర్ కూడా చేసినట్టు సమాచారం. 

ఈక్రమంలోనే విజయ్ ప్రస్తుతం  తన చేతిలో ఉన్న  సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాడట. అంతే కాదు కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ఇచ్చి.. పొలిటికల్ గా నిలబడ్డ తరువాత..  మళ్ళీ మొదలెట్టేఆలోచనలో ఉన్నాడట దళపతి. పార్టీ పనులు చకచకా జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. మరో వాదన ఏంటంటే.. పార్టీ అధికారంలోకి వస్తే.. విజయ్ సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెపుతారని కూడా టాక్. 

ఇక  ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైందని, 2026 అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ చేసి  తాడోపేడో తేల్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికలకు అనుభవం కోసం.. నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బరిలోకి కూడా దిగబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

ఇక తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం తో వరుస సమావేశాల్లో పార్టీకి సబంధించిన అనేక అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారితో  నాలుగుసార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనైయూర్‌లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండా ఇలా అనేక విషయాల్లో క్లారిటీకి వచ్చారట. ఇందులో భాగంగా పార్టీకి తమిళనాడు సెంటిమెంట్ కలిసి వచ్చేలా.. తమిళ మున్నేట్ర కళగం పేరును అందరు అనుకుని ఆమెదించినట్టు తెలుస్తోంది. 

ఇక త్వరలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంతో పాటు.. వరుస ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే విజయ్ చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇటు తెలుగు నిర్మాత డివివి దానయ్యతో కూడా విజయ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని.. ఈ సినిమాతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెపుతారని అంటున్నారు. 

ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా  తన కెరీర్ లో 68వ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత విజయ్ తన 69వ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా త్వరగా కంప్లీట్ చేసి..  దీని తర్వాత విజయ్ 70 వ సినిమాగా శంకర్ ను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే  కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. సోషల్ మీడియాలో రచ్చ కూడా జరుగుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios