తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయా..? కుటుంబం నుంచి ఆయన విడిపోయారా..? జ్యోతికాతో కలిసి విడిగా ఉంటున్నారా..? 

తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు.. తెలుగులో కూడా ఆయనకుమంచి మార్కెట్ ఉంది. తమిళనాట ఆయనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. తెలుగులో కూడా అంతే ఉన్నారు. ఇక సినిమాల విషయంలో సూర్య చేసే ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన సూర్య.. నెక్ట్స్ పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా సూర్యకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..?

సూర్య సినిమాలతోనే ఫేమస్ కాలేదు.. ప్రాణంగా చూసుకునే ఫ్యాన్స్ ను ఆయన సాధించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం. వ్యక్తిగతంగానూ సూర్య మనసు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌమ్యుడు, మంచి వాడు అయిన సూర్య.. ఇటు సినిమాలు చేస్తూ.. తన కుటుంబంతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారు. తండ్రి శివకుమార్‌, తమ్ముడు కార్తీలతో కలిసి ఈ మంచి పనులు చేస్తున్నారు.

ఇక ఈ క్రమంలో సూర్య ఫ్యామిలీకి సబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సూర్య తన కుటుంబం నుంచి వేరుపడ్డారన్న వార్త తమిళ ఫిల్మ్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. అంతే కాడు వీరు విడిపోవడానికి కూడా జ్యోతికానే పరోక్షంగా కారణం అయ్యింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తమిళ సీనియర్ యాక్టర్ బైల్వాన్ రంగనాథన్ చేసిన కామెంట్లను బేస్ చేసుకుని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. చాలా రోజులుగా సూర్యకు.. అతని తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీకి సంబంధాలు సరిగ్గా పొసగడం లేదు అంటూ న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. 

సూర్య.. జ్యోతికను పెళ్లి చేసుకోవడమే శివకుమార్‌ కు ఇష్టం లేదని... మొదట వ్యతిరేకించినా.. తరువాత ఒప్పుకోక తప్పలేదని తెలుస్తోంది. అయితే అది పక్కన పెడితే.. పెళ్లి తరువాత వెండితెరకు దూరం అయిన జ్యోతిక.. మళ్ళీ సినిమాలు చేస్తుండటం కూడా శివకుమార్ వ్యాతిరేకిస్తున్నారట. దాంతో తండ్రీ కొడుకుల మధ్య ఈ విషయంలో మనస్పర్థలు వచ్చాయని తమిళనాట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవి పెరిగి పెరిగి పెద్దవి అవుతుండటంతో.. సూర్య తన ఫ్యామిలీ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అంతే కాదు మరో విచిత్రమైన వార్త నెట్టింట్ల షికారు చేస్తోంది. సూర్య తన ప్యామిలీతో కలిసి ముంబయ్ లో ఉండబోతున్నట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు కొంత కాలంగాముంబయ్ లో ఉంటున్నట్టు కూడా సమాచారం వస్తోంది. అంతే కాదు ముంబయ్ లో ఇళ్ళు కూడా కొనేందకు వారు సిద్దమౌతున్నారట. అయితే ఈ విషయంలో అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే సూర్య కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే. మరి రూమర్స్ పై వారి స్పందన ఎలా ఉంటుంది. అసులు వీటి గురించి మాట్లాడుతారా లేదా అనేది చూడాలి.