Asianet News TeluguAsianet News Telugu

సినిమా చూడనివ్వలేదన్న సిల్లీ రీజన్ తో.. అజిత్ అభిమాని ఆత్మహత్య

హద్దుల్లో ఉండాల్సిన అభిమానం కట్టలు తెంచుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన తమిళనాట జరిగింది. అభిమానం తలకెక్కి స్టరా్ హీరో అజిత్ అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 

Tamil Star Hero Ajith fan commits suicide
Author
First Published Jan 22, 2023, 11:33 AM IST


అభిమానం ఉండాలి కాని హద్దులు దాటకూడదు. ఆ అభిమానం వల్ల కుటుంబం ఇబ్బందుల్లో పడకూడదు. చాలా మంది హీరోలు ఎప్పుడూ మొత్తుకునేది ఇదే. కట్టలు తెగిన ఆవేశం.. అభిమానం రంగు పులుముకుని చావడమో.. చంపడమో చేస్తుంటే సమాజం దాన్ని తీసుకోదు కదా. అందుకే ఎప్పటికప్పుడు స్టార్ హీరోలు తమ ఫ్యాన్న్ ను హెచ్చరిస్తూనే ఉంటారు ఈ విషయంలో.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ ఒక అడుగు ముందుకు వేసి.. తన అభిమాన సంఘాలు కూడా రద్దు చేశాడు. కాని అభిమానులు మాత్రం తమ తలతిక్క పనులు ఆపడం లేదు. ఆ పనులతోనే రీసెంట్ గా ఓ నిండు ప్రాణం బలైపోయింది. 

రీసెంట్ గా సంక్రాంతి కానుకగా అజిత్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అజిత్ నటించిన తునివు సినిమా తెలుగులో తెగింపు టైటిల్ తో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా కూడా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే.. సినిమా వరకు అంతా బాగానే ఉంది. కానీ.. సినిమా చూడనివ్వలేదని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాట సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... 

తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడికి చెందిన వీరబాగు అనే వ్యక్తి హీరో అజిత్ కి వీరాభిమాని. అజిత్  ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో అందరికీ తెలిసిందే. అజిత్ ప్రతీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సింది. అయితే అజిత్ సినిమా చూసేసిన వీరబాగు తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకు వెళ్ళాడు. తెగింపు సినిమాని ఫ్యామిలీతో చూసేందుకు టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ కి వెళ్ళాడు. అయితే అప్పటికే వీరబాగు మద్యం సేవించి ఉండటంతో.. థియేటర్ యాజమాన్యం అతన్ని లోపలికి అనుమతించలేదు.

దాంతో వీరబాగుకి, థియేటర్ సిబ్బందికి గొడవజరిగింది. ఈ విషయంలో మేనేజర్ కలగజేసుకుని వీరబాగును లోపలికి అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పేశాడు. అంతే కాదు తనను తన కుటుంబం ముందే దూషించడంతో పాటు.. వీరబాగుపై చేయికూడా చేసుకోబోయాడు. వీరబాగును అనుమతించకుండా.. తన కుటుంబం మొత్తాన్ని సినిమా చూసేందుకు అనుమతించాడు. తన ఫ్యామిలీ ముందే తనను ఇంతలా అవమానించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు వీరబాగు. దాంతో మళ్లీ మధ్యం సేవించి ఇంటికి వెళ్ళాడు. 

థియేటర్ నుంచి ఇంటికెళ్లి న అజిత్ అభిమాని వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా చూశాక ఇంటికెళ్లిన కుటుంబ సభ్యులు.. వీరబాగుని విగతజీవిగా చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించినట్లు తెలుస్తోంది. అజిత్ అభిమానులను హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇలాంటివి చేసేవారు తన అభిమానులు కాలేరు అంటూ అంటూనే ఉంటాడు. అయినా సరే ఇలాంటివి జరుగుతుండటం దారుణమనే చెప్పాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios