Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయం చేస్తోన్న వడివేలు కొడుకు.. స్టార్ కమెడియన్ గురించి షాకింగ్ నిజాలు..

తమిళ స్టార్ కమెడియన్ వడివేలు కుటుంబాన్ని ఎప్పుడైనా చూశారా..? ఆయన ఫ్యామిలీ ఎక్కడున్నారు.. వడివేలు కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా..? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. 

Tamil Star Comedian Vadivelu Son Farmer In village Shocking News JMS
Author
First Published Jan 25, 2024, 4:44 PM IST | Last Updated Jan 25, 2024, 4:47 PM IST

సాధారణంగా స్టార్ హీరోలు.. స్టార్ నటుల కొడుకులు ఏం చేస్తారు.. అయితే వారసత్వం తీసుకుని సినిమాల్లోకి అయినా వస్తారు.. లేదా ఏదైనా బిజినెస్ రంగంలో సెటిల్ అవుతారు.. లేదా.. బాగా చదువుకుని.. డాక్టర్లు, ఇంజనీర్లుగా.. ఫారెన్ లో సెటిల్ అవుతారు.. కాని చిత్రంగా కమెడియన్ స్టార్ కమెడియన్ వడివేలు కొడుకు ఏం చేస్తున్నారో తెలుసా..? వింటే షాక్ వుతారు.. వడవేలు కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు. వింటానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.  ఇక వివరాల్లోకి వెళ్తే..? 

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు స్టార్ గా తమిళనాట ఎదిగాడు. ఆతరువాత కొన్ని కాంట్రవర్సీల వల్ల  కొన్ని వివాదాలు ఏర్పడి... తమిళ సిని నిర్మాతల నుంచి భహిష్కరణకు గురయ్యారు. ఇక చాలా కాలానికి  తర్వాత తిరిగి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే  మామన్నన్ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా వడివేలు ఎప్పుడూ, ఎక్కడా తన ఇంటర్వ్యూల్లో  వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించరు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు కూడా బయటకు తెలియవు. 

ఈమధ్య  వడివేలు కొడుకు సుబ్రమణి పెళ్లి ఫోటోలు అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన జనం షాకయ్యారు. అసలు సుబ్రమణి ఎక్కడ ఉంటున్నారు? వడివేలు కొడుకుని సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదు? అనుకున్నారు. కాగా సుబ్రమణి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి వడివేలు గురించి.. తమ కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

వడివేలుకి కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. కొడుకు సుబ్రమణికి 10 ఏళ్ల క్రితం దగ్గర బంధువు కుమార్తెకు ఇచ్చి వివాహం చేసారట వడివేలు. అతికొద్దిమంది సమక్షంలో సుబ్రమణి పెళ్లైందట. తాజాగా యూట్యూబ్ ఛానల్‌కి స్నేహితులతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణి మాట్లాడారు. తన తండ్రికి ఏ విషయంలో అయినా సిఫారసు చేయడం ఇష్టం ఉండదని అందుకే ఎక్కడా తండ్రి పేరు ఉపయోగించనని సుబ్రమణి చెప్పారు. తన తండ్రి అంటే తనకెంతో ఇష్టమని ఆయన పేరునే తన పిల్లలకు పెట్టానని అన్నారు.

 

 తనకు ఏ అవసరం వచ్చినా తండ్రి సాయం చేస్తారని కానీ తను ఆయన మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకుంటున్నానని సిటీకి రమ్మని చెప్పినా వెళ్లనని సుబ్రమణి చెప్పారు. తండ్రి వడివేలు వారసత్వంగా ఇచ్చిన పొలంలో సుబ్రమణి వ్యవసాయం చేసుకుంటున్నారట.  సుబ్రమణి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. నెటిజన్లు మీ కొడుకుని మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దారని వడివేలుకి కితాబు ఇస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios