Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో, అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగాలేదుగా...?

బాలయ్యతో సినిమా అంటే మామూలుగా ఉండదు. దానికి కోసం ముందుగానే ప్లానింగ్స్ ముందుగానే ప్రిపరేషన్లు .. స్టార్ డైరెక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటారు. బాలకృష్ణతో సినిమా కోసం అనిల్ రావిపూడి కూడా ఇలానే ప్లాన్ చేస్తున్నాడు. బలయ్య పవర్ కు తగ్గట్టుగా కోలీవుడ్ నుంచి సీనియర్ ఆర్టిస్ట్ ను దింపబోతున్నాడట. 

Tamil Star Aravind swamy In Balakrishna108 Movie
Author
First Published Sep 6, 2022, 3:37 PM IST


బాలయ్య జోరుతో డైరెక్షర్లు బేజారు అవుతున్నారు. ఆయన ఊపుతో సినిమా షూటింగ్స్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుండటంతో.. దర్శకులు అలర్డ్ గా ఉండాల్సిన పనిరిస్థితి. ఇక అఖండ‌  అఖండ విజయంతో.. మరంత దూకుడు గా ఉన్నాడు బాలకృష్ణ. ఈసినిమా నంద‌మూరి బాల‌కృష్ణ‌ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా విజ‌యం బాల‌య్య‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. 

ఇక ప్రస్తుతం గోపిచంద్ మ‌లినేని డైరెక్షన్ లో కంప్లీట్ మాస్ అండ్  యాక్ష‌న్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సూపర్ పాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే.. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా.. ఈ ఇయర్ ఎండింగ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈసినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు  బాలయ్య. 

గోపీచంద్ తో మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నా బాలకృష్ణ.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌ మూవీని చేయబోతున్నాడు.  ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా పూర్తి చేసుకుంది  ఈ సినిమా.  అతి త్వ‌ర‌లోనే సెట్స్‌ పైకి వెళ్ళ‌నుంది సినిమా. అయితే ఈ సినిమా కోసం చాలా ప్లాన్లు వేస్తున్నాడట అనిల్ రావిపూడి. బాలయ్యతో సినిమా అవకాశం రావడం పెద్ద విషయం.. ఆ అవకాశాన్ని బాగా వాడుకోవాలి అని చూస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఓ ఇంపార్టెంట్ న్యూస్ బయటకు వచ్చింది. 

రీసెంట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో  కీల‌క పాత్ర కోసం తమిళ సీనియర హీరో కమ్  క్యారెక్టర్ ఆర్టిస్ట్ అర‌వింద్ స్వామిని మేక‌ర్స్ సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తుంది. క‌థ న‌చ్చ‌డంతో ఆయన కూడా  కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేయాలని చూస్తున్నారట టీమ్.  తెలుగులో రీసెంట్ గానే కొన్ని సినిమాలు చేశారు అరవింద స్వామి. 

ఇక హీరోగా.. రోజా,ముంబయ్ లాంటి క్లాసిక్ సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించాడు అరవింద స్వామి.  చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న అరవిందస్వామి. ఆతరువత స్టైలీష్ లుక్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.తెలుగులో రామ్‌చ‌ర‌ణ్  ధృవ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు. ఇక ఇప్పుడు బాల‌య్య సినిమాలో కీల‌క‌పాత్ర పోషించ‌నుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో విప‌రీత‌మైన ఆస‌క్తి నెల‌కొంది.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీనిఫాద‌ర్‌-డాట‌ర్ సెంటిమెంట్‌తో అనిల్ రావిపూడి రూపొందించబోతున్నట్టు సమాచారం.  బాల‌య్య‌కు కూతురుగా పెళ్లి సందడి  ఫేం శ్రీలీల న‌టిస్తుంది. ప్ర‌ముఖ హీరోయిన్ అంజ‌లీ కీల‌క‌పాత్ర‌లో కనిపించనున్న ఈ సినిమాను  షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి  నిర్మిస్తున్నాడు. అఖండాతో సూపర్ హిట్ బ్యూజిక్ ఇచ్చిన తమ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios