ఈ రోజు ఉదయం దర్శకుడు కె. వి ఆనంద్‌ గుండెపోటుతో మరణించారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు ఆర్‌ఎస్‌జీ చెల్లదురై అయ్యా(84 కన్నుమూశారు.

కోలీవుడ్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం దర్శకుడు కె. వి ఆనంద్‌ గుండెపోటుతో మరణించారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు ఆర్‌ఎస్‌జీ చెల్లదురై అయ్యా(84 కన్నుమూశారు. గురువారమే ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. సీనియర్‌ నటుడిగా చెల్లదురై రజనీకాంత్‌ `శివాజీ`, నయనతార `రాజారాణి`, విజయ్‌ `కత్తి`, ధనుష్‌ `మారి`, విజయ్‌ `థెరి` వంటి అనేక భారీ, సూపర్‌ హిట్‌ చిత్రాల్లోనటించి ఆకట్టుకున్నారు. ఆయన బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, గుండెపోటు కారణంగానే చనిపోయి ఉంటారని భావిస్తున్నారట. 

దీంతో తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వరుస మరణాలతో కోలీవుడ్‌ పూర్తి విషాదంలో మునిగిపోయింది. ఓ వైపు కరోనా, మరోవైపు ఒక్కొక్కరు సినీ ప్రముఖులు చనిపోవడం కలచివేస్తుంది. కోలుకోని విధంగా దెబ్బతీస్తుందని పలువురు ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. నటుడు చెల్లదురైకి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Scroll to load tweet…
Scroll to load tweet…