రక్తమార్పిడి చేయాలనే వైద్యుల సలహా మేరకు కాళిదాస్‌కి రక్త మార్పిడి సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు.

కోలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ఇటీవల చాలా మంది తమిళ నటులు, దర్శకులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజా ప్రముఖ తమిళ హాస్య నటుడు కాళిదాస్‌(65) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల వైద్య పరీక్షలు చేయగా, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు గుర్తించారు. దీంతో రక్తమార్పిడి చేయాలనే వైద్యుల సలహా మేరకు కాళిదాస్‌కి రక్త మార్పిడి సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా శుక్రవారం పూర్తి చేశాయి. 

నటుడు కాళిదాసుకి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య గతంలోనే మరణించారు. హాస్యనటుడిగా తమిళంలో పాపులర్‌ అయిన కాళిదాసు ఒకప్పుడు స్టార్‌ కమేడియన్‌ వడివేలుతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, హాస్య నటులు సంతాపం తెలిపారు. కాళిదాస్‌ దాదాపు రెండు వేలకు పైగా చిత్రాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా పనిచేశారు. చాలా వరకు ఆయన పోలీస్‌ పాత్రలే పోషించడం విశేషం.