తమిళ సినీ నిర్మాత మండలిలో చాలా కాలంగా వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నిర్మాతల మండలికి విశాల్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడంపైకొందరు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. 

విశాల్ అతడి బృందం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు విశాల్ వ్యవహారశైలి కారణంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విశాల్ మీద ఆరోపణలు ఎక్కువ కావడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకుంది. 

నిర్మాతల మండలి వ్యవహరాలు ఏడాది పాటు పర్యవేక్షించడానికి శేఖర్ అనే అధికారిని నియమించింది. వచ్చే ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు అన్ని విషయాల్లో శేఖర్ అనే అధికారి ప్రమేయం ఉంటుందని తెలుస్తోంది. విశాల్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే దానికి ఆయన అనుమతి ఉండాలనితెలుస్తోంది.

దీంతో తమిళ సర్కార్ విశాల్ ని డమ్మీ ప్రెసిడెంట్ చేసిందంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా విశాల్ కొనసాగుతున్నారు. అక్కడ కూడా విశాల్ పై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విశాల్ సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. మరి ఆయన ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి!