దేశం అంతా ఎలక్షన్ల హడావిడి స్టార్ట్ అయ్యింది. ఓటర్ల పండగ జరగబోతోంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ.. ఎలక్షన్స్ సందడిలో పాలు పంచుకోబోతున్నారు. తాజాగా ఎలక్షన్స్ గురించి ఓటర్లకు సూచన చేశారు తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.
లోక్‌సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఈ లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించి జూన్ 1న ముగుస్తాయి. ఆ తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎలక్షన్స్ జరగబోతుండగా.. మనకంటే ముందు తమిళనాడులో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నిక జరగబోతోంది. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, రాజకీయ రంగం అంతా అందుకు సన్నాహాలు చేస్తోంది. అన్ని పార్టీలు తమ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయడం ప్రారంభించారు. ఈ సారి అందరికంటే ముందే ప్రధాని మోదీ కదనరంగంలోకి వచ్చారు. రంతరం ప్రజలను కలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు కొంత మంది నోటి నుంచి ఎలక్షన్లకు సబంధించిన మాటలు వస్తుంటాయి. అవి వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొన్నేళ్ల క్రితం మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు మకల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో మళ్లీ వైరల్‌గా షేర్ అవుతోంది. ‘ఎన్నికలు వస్తున్నాయి, దయచేసి మీరు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి’ అని వీడియోలో పేర్కొన్నారు.
దానికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పే వారితో వచ్చి పోరాడడం మాకు ఇబ్బందిగా ఉందని, అయితే మన కులానికి, మన మతానికి సమస్య వస్తే పోరాడుదాం అని చెప్పే వారితో కలసిపోవద్దని అన్నారు. నిజాయితీగా ఓటు వేయాలని విజయ్ అందులో వేడుకున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
