నన్ను బెదిరించేవాళ్లు.. అందుకే నిర్మాతను అయ్యాను.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..
ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదొ ఒక వివాదంలో నిలుస్తుంటాడు తమిళ స్టార్ హీరో విశాల్. తాజాగా ఆయన నిర్మాతలపై చేసిన వ్యాక్యలుసంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?

తమిళంలో స్టార్ హీరోగా ఎదిగాడు తెలుగు కుర్రాడు విశాల్. టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సాధించాడు. తన ప్రతి సినిమాని ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తూ.. ఇక్కడ కూడా రిలీజ్ చేస్తారు. ఇక ప్రస్తుతం విశాల్ తన మార్క్ ఆంటోనీ సినిమా హడావిడిలో ఉన్నాడు. త్వరలో విశాల్ మార్క్ ఆంటోని సినిమాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. టైం ట్రావెల్ కథతో మార్క్ ఆంటోనీ తెరకెక్కినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో తానే ఎందుకు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు అనే దానికి సమాధానమిస్తూ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విశాల్. కొందరు నిర్మాతలు చేసే పనుల వల్ల ఆ ఫీల్డ్ కే నష్టం జరుగుతందని అందుకే తాను నిర్మాతగా మారాను అంటున్నారు విశాల్. అంతే కాదు నిర్మాతల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విశాలో ఏమన్నారంటే..?
విశాల్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో అందరికి ఏదో ఒకరకమైన సమస్యలు ఉంటాయి. చాలా కాలం వెయిట్ చేసి పందెంకోడి సినిమా చేశాను. అది పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతో తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా నాకు యాక్షన్ హీరో అనే పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేశాను. కానీ అవి రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాతలు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. శుక్రవారం సినిమా రిలీజ్ అంటే గురువారం రాత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు. ఫైనాన్షియర్స్ కి డబ్బులు ఇవ్వలేదు, సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పి నాతో డబ్బులు కట్టించేవాళ్ళు అన్నారు.
సరిగ్గా రెమ్యునరేషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అదే సమయంలో ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ఇలాంటి ఇబ్బందులు చాలా చూశాను. అందుకే నా వళ్ళ కాదు అనుకొని నేనే సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రారంభించి మంచి కథలతో వరుసగా సినిమాలు చేస్తూ నిలబడ్డాను అని అన్నారు. ఇక నిర్మాతలపై ముక్కుసూటిగా మాట్లాడిన విశాల్ మాటలకు ఎవరైనా నిర్మాతలు స్పిందించి.. ఖండిస్తారా..? లేదా అనేది చూడాలి.