Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన విశాల్, తన ప్రియురాలిని త్వరలో పరిచయం చేస్తానన్న తమిళ హీరో

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే గుర్తుకు వచ్చేది తెలుగు కర్రాడు విశాల్ పేరే. 50 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా.. ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు విశాల్. ఇక ఎట్టకేలకు తన పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు విశాల్. త్వరలో తన ప్రేయసిని పరిచియం చేయబోతున్నాడట. 

Tamil Hero Vishal Marriage with Actress Abhinaya
Author
First Published Nov 8, 2022, 8:44 PM IST

చాలా కాలంగా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో విశాల్ పెళ్ళి గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావంటూ.. ఆయన ఫ్యాన్స్ గట్టిగానే అడిగేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్ పెళ్ళిపే క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా మాట్లాడిన విశాల్ తన ప్రేయసి గురించి కూడా ఓ చిన్న హిట్ ఇచ్చాడు. 

హీరో విశాల్ హీరోయిన్ అభినయతో  ప్రేమలో ఉన్నాడనే వార్తలు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో  చక్కర్లు కొడుతున్నాయి.  ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని..  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.  అయితే ఈ ఇద్దరు తారలు మార్క్ ఆంటోనీ సినిమాలో కలిసి నటించారు. ఈసినిమాలో విశాల్ భార్యగా అభినయ నటించింది. ఈక్రమంలోనే వీరిపై సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో విశాల్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. 

తాజాగా తన పెళ్ళిపై స్పందించాడు విశాల్. ఈవిధంగా స్పందించాడు. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని అన్నారు విశాల్ అందుకే తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు.ఇక అందరికోసం త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని  పరిచయం చేస్తానని అన్నారు. ఇక పెళ్ళి డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు విశాల్. ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ కోసం బిల్డింగ్ కడుతున్నామని... అది పూర్తవ్వడానికి మూడేళ్లు పడుతుందని  ఆయన అన్నారు. అది పూర్తి అవ్వగానే తాను వెంటనే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

ఇక గతంలో విశాల్ పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా కలిసిరాలేదు.ఇప్పటికే విశాల్‌ పెళ్లివరకు వెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కి చెందిన ఓ యాక్ట్రస్ ను విశాల్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేసినఅమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూశాడు. కానీ ఏమైందో ఏంటో తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. 

అంతే కాదు గతంలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు.. నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో విశాల్ ప్రేమలో మునిగి తేలాడంటూ.. ప్రచారం జరిగింది. వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారని అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో వార్త వైరల్‌ అయ్యింది. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కొన్నాళ్లకి ఆ వార్తలు ఆగిపోయాయి.  ఇప్పుడు నటి అభినయతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే..?  నటిగా కీలక పాత్రల్లో నటిస్తున్న అభినయకి వినికిడి లోపం ఉన్న విషయం తెలిసిందే. మాటలు కూడా రావు. ఈ పెళ్ళితో విశాల్ మంచి మనసు మరో సారి చర్చకు వస్తుందంటున్నారు ఆడియన్స్. 

Follow Us:
Download App:
  • android
  • ios