తమిళ ఇండస్ట్రీలో కాంట్రవర్సియల్ హీరోలలో విశాల్ కూడా ఒకరు. ఓవివాదంలో విశాల్ కు కోర్టులో చుక్కెదురయ్యింది. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి స్టార్ హీరోకు ఎదురు దెబ్బ తగిలింది.
హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్రొడక్షన్ హౌస్ లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో 15 కోట్లు డిపాజిట్ చేయాలని తమిళ స్టార్ హీరో విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
లైకా సంస్థతో విశాల్ గతంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న 21 కోట్లు చెల్లించకుండానే విశాల్ తన వీరమే వాగై సుడుం సినిమాను రిలీజ్ చేయబోయారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే గమనించిన లైకా టీమ్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్డు విశాల్ ఆడబ్బును డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింద.
డబ్బు చెల్లించకుండా మూవీని రిలీజ్ చేయాలని చూడటమే కాకుండా.. శాటిలైట్, ఓటీటీ హక్కులను కూడా అమ్మేందుకు విశాల్ ప్రయత్నిస్తున్నారని లైకా సంస్థ ఆరోపించింది. కాబట్టి సినిమా విడుదల, హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరింది. ఈ కేసు నిన్న (12 మార్చ్) విచారణకు వచ్చింది. వాదనలు విన్న జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.
